Home అంతర్జాతీయ వార్తలు బోరిస్ కేబినెట్‌లో మనోళ్లు

బోరిస్ కేబినెట్‌లో మనోళ్లు

Indian Origin Ministers

 

ఆర్థికమంత్రిగా ఇనోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్
ప్రీతి పటేల్, అలోక్ శర్మలకు చోటు

లండన్ : భారత సంతతికి చెందిన రాజకీయ నాయకుడు, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్‌ను బ్రిటన్ ఖజానా నూతన ఛాన్సలర్‌గా (భారతదేశంలో ఆర్థికమంత్రి హోదా) నియమించినట్టు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గురువారం ప్రకటించారు. జాన్సన్ కేబినెట్‌లో భారతీయ సంతతికి చెందిన ముగ్గురిలో సునక్ ఒకరు. అంతకు ముందు గత ఏడాది జూలైలో భారతీయ సంతతికి చెందిన ప్రీతి పటేల్‌ను, అలోక్ శర్మను బ్రిటిష్ కేబినెట్‌లోకి తీసుకున్నారు. ఇంతవరకు బ్రిటన్ ఖజానా ఛాన్సలర్‌గా ఉన్న పాకిస్థాన్ సంతతికి చెందిన సాజిద్ జావిద్ రాజీనామా చేయడంతో గురువారం హఠాత్తుగా కేబినెట్‌ను పునర్‌వ్యవస్థీకరించారు.

బ్రెగ్జిట్ నుంచి వైదొలగిన తర్వాత తన దృక్పథానికి రూపురేఖల్ని కల్పించే ఉద్దేశంతో జాన్సన్ కేబినెట్ తీర్చిదిద్దారు. గత ఏడాది జూలైలో క్వీన్ ఎలిజెబెత్ తనను బ్రిటన్ కొత్త ప్రధానిగా నియమించిన తర్వాత అచిరకాలంలోనే బోరిస్ జాన్సన్ బ్రిటన్ మంత్రివర్గాన్ని అత్యంత వైవిధ్యభరితంగా రూపొందించారు. ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ సెక్రెటరీగా ఉన్న శర్మ (51) బిజినెస్ సెక్రెటరీగా పదోన్నతి పొందారు. అంతకు ముందు ఆయన విదేశాలకు బ్రిటన్ సహాయాన్ని అందించే శాఖలో పనిచేశారు. ప్రతి ఏటా వచ్చే బ్రిటన్ జాతీయ ఆదాయంలో 0.7 శాతాన్ని అంతర్జాతీయ సహాయం కోసం ఈ శాఖ ఖర్చు చేస్తుంది.

Indian Origin Ministers in UK PM Boris Johnson Cabinet