Home అంతర్జాతీయ వార్తలు అమెరికాలో భారతీయ పరిశోధకురాలి హత్య

అమెరికాలో భారతీయ పరిశోధకురాలి హత్య

Indian-origin woman researcher killed while jogging

 

హూస్టన్: అమెరికాలో 43 ఏళ్ల భారతీయ పరిశోధకురాలు హత్యకు గురయ్యారు. ఫార్మసిస్ట్, పరిశోధకురాలు శర్మిష్టసేన్ డల్లాస్ సమీపంలోపి శివారు ప్రాంతం ప్లేనోలో ఆగస్టు 1న జాగింగ్‌కు వెళ్లిన సమయంలో హత్యకు గురైనట్టుగా అనుమానిస్తున్నారు. జార్ఖండ్‌లోని సింద్రీకి చెందిన శర్మిష్టకు ఇద్దరు కుమారులున్నారు. అరిందమ్‌రాయ్ అనే అతణ్ని వివాహమాడిన తర్వాత ఆమె అమెరికా వెళ్లారు.

శర్మిష్ట హత్య కేసులో బకారీ మోన్‌క్రీఫ్(29) అనే అనుమానితుడిని అరెస్ట్ చేశారు. అయితే, తగిన సాక్షాలు చూపాల్సి ఉన్నదని పోలీసులు తెలిపారు. శవ పరీక్ష నివేదిక ఇంకా తమకు అందలేదని తెలిపారు. ఈ హత్య వెనుక జాతి వివక్ష కారణమేమైనా ఉన్నదా అన్న దిశగా కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఇరుగుపొరుగులో ఎంతో మంచి పేరున్న శర్మిష్ట స్మారక సభను ఈ నెల 8న నిర్వహించాలని స్థానికులు నిర్ణSarmistha Senయించారు.

Indian-origin woman researcher killed while jogging