Home జాతీయ వార్తలు భారత సంతతి మహిళకు అమెరికాలో జైలుశిక్ష

భారత సంతతి మహిళకు అమెరికాలో జైలుశిక్ష

Arrestన్యూయార్క్: భారతదేశంతోపాటు ఇతర దేశాల నుంచి చట్టవిరుద్ధంగా వందలాది మంది విదేశీయులను రవాణా చేసిన నేరానికి భారతీయ సంతతికి చెందిన ఒక 51 సంవత్సరాల మహిళకు మూడేళ్ల కారాగార శిక్షతోపాటు కోట్లాది రూపాయల విలువచేసే ఆస్తులను అమెరికా ప్రభుత్వ స్వాధీనం చేసుకుంది. ఒక్కో వ్యక్తి నుంచి 28,000 నుంచి 60,000 అమెరికన్ డాలర్లను రుసుముగా స్వీకరించి చట్టవిరుద్ధంగా మనుష్యుల అక్రమ రవాణాకు పాల్పడ్డారన్న అభియోగంపై హేమా పటేల్ అనే మహిళను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు.

అమెరికాలోకి అక్రమంగా విదేశీ పౌరుల రవాణాకు పాల్పడినట్లు ఆమె అంగీకరించడంతో అమెరికాలో ఆమెకు చెందిన టెక్సాస్‌లోని రెండు హోటళ్లు, 72 లక్షల డాలర్ల విలువైన బెయిల్ బాండ్లు, 4 లక్షల డాలర్ల నగదు, 11 బంగారు కడ్డీలు, ఒక ఇంటిని అమెరికా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ తెలిపాయి. హేమ పటేల్, ఆమె సహచరులు విదేశీయులను అక్రమంగా అమెరికాలోకి రవాణా చేయడానికి కెనడా లేదా మెక్సికో మార్గాలను ఎంచుకుంటారు. ఎటువంటి అధికారిక పత్రాలు లేని వీరిని వీరిని అమెరికా సరిహద్దులో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్న వెంటనే హేమ పటేల్ రంగంలోకి దిగుతుంది.

వారి తరఫున నకిలీ బాండు పత్రాలను సృష్టించి తప్పుడు పేర్లు, చిరునామాలతో వారికి బెయిల్ ఇప్పిస్తుంది. వారి కేసు విచారణ పూర్తయ్యేవరకు వారికి టెక్సాస్‌లోని తన హోటళ్లలోనే ఆమె ఆశ్రయం కల్పిస్తుంది. 2016 నవంబర్‌లో అధికారులు ఆమె ఇంటిని సోదా చేసినపుడు కొన్ని వేల మంది అక్రమ వలసదారులకు చెందిన పత్రాలు లభించాయి. ఏడాది తర్వాత హేమ పటేల్ సహచరుడు చంద్రేశ్ కుమార్ పటేల్‌ను అదుపులోకి తీసుకోవగా తాము కొన్ని వేల మందిని అక్రమంగా దేశంలోకి తీసుకువచ్చినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతనికి మూడేళ్ల జైలు శిక్ష విధించడంతోపాటు 80 వేల అమెరికన్ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు.

Indian origin woman sentenced in US, Hema Patel was sentenced for smuggling hundreds of aliens into US