Thursday, April 25, 2024

 ఐపిఎల్ భారత్‌లో ఉండదు

- Advertisement -
- Advertisement -

Indian premier league not in India

కోల్‌కతా : కరోనా వల్ల అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపిఎల్ మిగిలిన దశను తిరిగి భారత్‌లో నిర్వహించే అవకాశమే లేదని బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐపిఎల్‌ను నిర్వహించే పరిస్థితులు భారత్‌లో లేవన్నాడు. ఇప్పటికిప్పుడూ దేశంలో మాములు పరిస్థితులు ఏర్పడుతాయని తాను భావించడం లేదన్నాడు. అంతేగాక ఆయా రాష్ట్రాలకు చెందిన క్రికెట్ బోర్డులు కూడా ఐపిఎల్‌ను నిర్వహించేదుకు ముందుకు వచ్చే అవకాశం లేదన్నాడు. ఇలాంటి స్థితిలో విదేశాల్లోనే ఐపిఎల్ రెండో దశను నిర్వహించక తప్పదన్నాడు. అయితే రెండో దశ ఎప్పుడూ నిర్వహించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

ఇతర దేశాల క్రికెట్ బోర్డులతో చర్చించిన తర్వాతే దీనిపై తగు నిర్ణయం తీసుకుంటామని గంగూలీ వివరించాడు. అప్పటి వరకు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేమని పేర్కొన్నాడు. భారత్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అన్ని జట్లకు ఇక్కడ 14 రోజుల క్వారంటైన్ వంటి ఏర్పాట్లు చాలా కష్టంతో కూడుకున్న విషయమన్నాడు. దీంతో భారత్‌లో ఐపిఎల్‌ను నిర్వహించే వీలు లేకుండా పోయిందన్నాడు. ఇక లీగ్‌ను ఎప్పుడు నిర్వహిస్తామో ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందన్నాడు. ఐపిఎల్ వంటి మెగా టోర్నమెంట్‌ను నిర్వహించడం ఎప్పుడు కూడా చాలా క్లిష్టమైన అంశమన్నాడు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా సీజన్ మధ్యలో బయటపడిన కరోనా కేసులు తమను ఎంతో ఆవేదనకు గురి చేశాయమన్నాడు.

ఇలాంటి సమయంలో ఐపిఎల్‌ను భారత్‌లో నిర్వహించి సమస్యలు కొని తెచ్చుకోవడం తమకు ఇష్టం లేదని గంగూలీ తేల్చి చెప్పాడు. మరోవైపు ఐపిఎల్‌ను నిర్వహించేందుకు పలు దేశాలకు చెందిన క్రికెట్ బోర్డులు ముందుకు వస్తున్నాయన్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన పలు కౌంటీలు, శ్రీలంక, యూఎఇ తదితర దేశాలకు చెందిన క్రికెట్ బోర్డులు ఐపిఎల్ నిర్వహించేందుకు సిద్ధమని తమకు ప్రతిపాదనలు తెలిపాయన్నాడు. ఫ్రాంచైజీల యజమాన్యాలు, ఇతర దేశాల క్రికెట్ బోర్డుల ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటామని గంగూలీ వివరించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News