Friday, April 26, 2024

చైనా సరిహద్దులకు భారీగా బలగాలు..

- Advertisement -
- Advertisement -

Indian Security forces to be China border

న్యూఢిల్లీ: చైనా దేశంతో ఉన్న సరిహద్దుల వెంబడి అదనంగా మరో 35 వేల మందిని నియమించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. గల్వాన్ ఘటన తరువాత ఇరుదేశాల మధ్య జరుగుతున్న చర్చలు ఇప్పట్లో ఫలితమిచ్చే అవకాశం లేకపోవడంతో భారత్ ముందుజాగ్రత్త చర్యలకు పూనుకుంటోంది. భారత్‌-చైనా సరిహద్దులు 3,488 కిలోమీటర్ల పొడవు ఉండగా వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దులను కాపాడుకునేందుకు భారత్ ఇప్పటికే భారీగా ఖర్చు పెడుతోంది. ‘వాస్తవాధీన రేఖ వెంబడి మరీ ముఖ్యంగా లద్దాఖ్ ప్రాంతంలో పూర్తిగా మారిపోయింది.

రెండువైపులా అదనపు బలగాలను మోహరిస్తున్నారు. అత్యున్నత స్థాయి రాజకీయ నిర్ణయం జరిగితే మినహా ఏ పక్షమూ తన బలగాలను వెనక్కు తీసుకోదు” అని ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ‘ద యునైటెడ్ సర్వీస్ ఇన్‌స్టిట్యూషన్’ డైరెక్టర్ విశ్రాంత మేజర్ జనరల్ బి.కె.శర్మ తెలిపారు. సరిహద్దు సమస్యపై కమాండర్ల స్థాయిలో ఇంకోసారి చర్చలు జరగనున్నాయని, సమస్య పరిష్కారానికి భారత్ తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ వ్యాఖ్యానించారు.

Indian Security forces to be China border

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News