Saturday, April 20, 2024

స్వల్ప ఊరట

- Advertisement -
- Advertisement -

Indian stock market weekly review

గతవారం పుంజుకున్న మార్కెట్లు
1,410 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
(మార్కెట్ సమీక్ష)

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు గతవారం స్వల్పంగా పుంజుకున్నాయి. ఇన్వెస్టర్లకు కాస్త ఊరటనిచ్చాయి. అయితే ఇప్పటికీ సూచీలు ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే ఉన్నాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను నమోదు చేశాయి. గతవారం ఐదు సెషన్లలో సెన్సెక్స్ మొత్తంగా 1,410 పాయింట్లు లాభపడింది. అంతకుముందు వారంలో ఫెడ్ రిజర్వు వడ్డీ రేట్ల పెంపు కారణంగా మార్కెట్లు అతలాకుతలం అయ్యాయి. ప్రపంచ దేశాల మార్కెట్లు నష్టాలను చూడగా, భారత్ మార్కెట్లు కూడా పతనం అయ్యాయి. అయితే ఇప్పుడు స్వల్పంగా పుంజుకోగా, వారాంతం శుక్రవారం నాడు సెన్సెక్స్ 462 పాయింట్లు పెరిగి 52,728 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 143 పాయింట్లు లాభపడి 15,699 పాయింట్ల వద్ద స్థిరపడింది. మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు వరుసగా 1.21 శాతం, 1.31 శాతం చొప్పున పెరిగాయి. రంగాల వారీగా చూస్తే 15 సెక్టార్లకు గాను 14 లాభాలను చూశాయి.

బిఎస్‌ఇలో 2,396 షేర్లు లాభపడగా, 909 షేర్లు నష్టాలను నమోదు చేశాయి. దేశీయ అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసి షేరు 0.48 శాతం పడిపోయి రూ.661.70 వద్ద ముగిసింది. ఆటోమొబైల్, బ్యాంక్, కన్జూమర్ స్టాక్స్‌లో కొనుగోళ్ల జోరుతో మార్కెట్ లాభపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత పతనమైంది. జీవితకాల కనిష్టానికి పడిపోయింది. శుక్రవారం డాలర్‌పై రూపాయి విలువ 78.33కు క్షీణించింది. అయితే ద్రవ్యోల్బణంపై ఆర్‌బిఐ ఇప్పటికీ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. ద్రవ్య లోటు, స్థిరమైన ఆర్థిక వృద్ధి, కరెంట్ ఖాతా లోటు, ద్రవ్యోల్బణం కట్టడి చేసే ప్రయత్నంలో సమీప కాలంలో భారతదేశం సవాళ్లను ఎదుర్కోనుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ భారత్ ఇతర దేశాలతో పోలిస్తే మెరుగ్గానే ఉందని ప్రభుత్వం తెలిపింది. నెలవారీ ఆర్థిక నివేదికలో ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ విషయాలను వెల్లడించింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు, ప్రత్యేకించి అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ఇలాంటి సవాళ్లనే ఎదుర్కొంటున్నాయి. అయితే వాటితో పోలిస్తే భారత్ సమస్యలను పరిష్కరించుకునే సామర్థం కల్గివుందని, ఎందుకంటే ఆర్థిక రంగ స్థిరంగా ఉండడంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియం విజయవంతంగా నిర్వహించడమే అని ఆర్థిక సమీక్ష పేర్కొంది. సమీప భవిష్యత్‌లో భారత్ వృద్ధి ప్రకాశవంతంగా ఉంటుందని నివేదిక తెలిపింది. 202223 ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయం బడ్జెట్ వృద్ధి ఊతమిస్తుందని చెబుతూ, పెట్రోల్, డీజిల్‌కు ఎక్సైజ్ సుంకాలు తగ్గించిన నేపథ్యంలో స్థూల ఆర్థిక లోటు పెరిగింది. కరెంట్ ఖాతా లోటు పెరిగిన కారణంగా ద్రవ్యలోటు పెరిగి దిగుమతులు మరింత భారంగా మారుతున్నాయి. రూపాయి విలువ బలహీన కూడా లోటును పెంచుతోందని నివేదిక వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News