Home అంతర్జాతీయ వార్తలు అమెరికాలో భారతీయ యువకుడి హత్య

అమెరికాలో భారతీయ యువకుడి హత్య

Murderన్యూయార్క్‌ : అమెరికాలో ఓ భారతీయ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పంజాబ్ కు చెందిన బల్జీత్ సింగ్ అలియాస్ ప్రిన్స్ (28) న్యూయార్క్ లోని ఓ డిపార్ట్ మెంట్ స్టోర్ లో పని చేస్తున్నాడు. విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న బల్జీత్ ను దుండగులు అడ్డగించారు. బల్జీత్ వద్ద డబ్బు, విలువైన వస్తువులు లేకపోవడంతో అతడిపై దుండగులు కాల్పులు జరిపారు. వెంటన బల్జీత్ ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బల్జీత్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. బల్జీత్ పై కాల్పులు జరిపిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Indian Teenager Murder In America