Home Default అమ్మాయిల హ్యాట్రిక్

అమ్మాయిల హ్యాట్రిక్

  • చెలరేగిన ఏక్తా, పాకిస్థాన్ చిత్తు, మిథాలీ సేనకు మూడో గెలుపు

Ekta-Bisht

డెర్బీ: మహిళా ప్రపంచకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ 93 పరుగుల భారీ తేడాతో జయకేతనం ఎగుర వేసింది. బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్‌లో దాయాది పాక్ 170 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక పోయింది. ఏక్తా బిస్త్ (5/18) అసాధారణ బౌలింగ్‌తో చెలరేగడంతో పాకిస్థాన్ ౩8.1 ఓవర్లలో కేవలం 74 పరుగులకే కుప్పకూలింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇది హ్యాట్రిక్ విజయం కావడం విశేషం. ఈ గెలుపుతో మిథాలీ సేన నాకౌట్ అవకాశాలు మరింత మెరుగయ్యాయి. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఓపెనర్ పూనమ్ రౌత్ (47) టాప్ స్కోరర్‌గా నిలిచింది. వికెట్ కీపర్ సుష్మా వర్మ (౩౩), దీప్తి శర్మ (28) తప్ప మిగతావారు విఫలమయ్యారు. పాక్ జట్టులో నశ్రా సంధు నాలుగు వికెట్లు పడగొట్టి భారత్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషించింది.
ప్రారంభం నుంచే..
స్వల్ప లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ప్రారంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఏక్తా బిస్త్ అద్భుత బౌలింగ్‌తో పాక్‌ను హడలెత్తించింది. ఓపెనర్ అయేషా జఫర్ (1)ను తన మొదటి ఓవర్‌లోనే ఏక్తా బిస్త్ పెవిలియన్ పంపించింది. వన్‌డౌన్‌లో వచ్చిన జవేరియా ఖాన్ (6)ను జులాన్ గోస్వామి ఔట్ చేసింది. మరోవైపు వికెట్ కీపర్ సిద్రా నవాజ్ (౦), ఇరమ్ జావిద్ (౦)లను ఏక్తా బిస్త్ పెవిలియన్ బాట పట్టించింది. తర్వాత పాక్ మళ్లీ కోలుకోలేక పోయింది. తర్వాత వచ్చిన బ్యాట్స్‌విమెన్‌లు ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో పాక్ స్వల్ప స్కోరుకే పరిమితం కాక తప్పలేదు. పాక్ జట్టులో నాహిదా ఖాన్ (22), సనా మీర్ (29)లు మాత్రమే రెండంకెలా స్కోరును అందుకున్నారు. మిగతావారిలో కనీసం ఆరు పరుగులకు మించి స్కోరును చేయలేక పోయారు. నలుగురు ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. భారత బౌలర్లలో ఏక్తా బిస్త్ పది ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు

వికెట్లు పడగొట్టింది. మాన్సీ జోషి రెండు వికెట్లు తీసింది. దీప్తి శర్మ పది ఓవర్లలో 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ ఖాతాలో వేసుకుంది. హర్మన్‌ప్రీత్‌కు ఒక వికెట్ లభించింది. గోస్వామి కూడా ఒక వికెట్ పడగొట్టింది. భారత బౌలర్ల విజృంభణతో పాక్ ఇన్నింగ్స్ 74 పరుగుల వద్దే ముగిసింది.
స్కోరు బోర్డు:
భారత ఇన్నింగ్స్: పూనమ్ రౌత్ (సి) అండ్ (బి) నశ్రా సంధు 47, స్మృతి మందన ఎల్బీ-బి డయానా బేగ్ 2, దీప్తి శర్మ (సి) సిద్రా నవాజ్ (బి) నశ్రా సంధు 28, మిథాలీ రాజ్ ఎల్బీ-బి నశ్రా సంధు 8, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి) సనా మీర్ (బి) సాదియా యూసుఫ్ 10, మోనా మెశ్రమ్ (బి) సాదియా యూసుఫ్ 6, సుష్మా వర్మ (సి) డయానా బేగ్ (బి) అస్మావియా ఇక్బాల్ ౩౩, జులాన్ గోస్వామి (బి) నశ్రా సంధు 14, మాన్సి జోషి నాటౌట్ 4, ఏక్తా బిస్త్ రనౌట్ 1, పూనమ్ యాదవ్ నాటౌట్ 6, ఎక్స్‌ట్రాలు 10, మొత్తం 50 ఓవర్లలో 169/9.
బౌలింగ్: అస్మావియా ఇక్బాల్ 10-0-46-1, డయానా బేగ్ 10-3-28-1, నశ్రా సంధు 10-1-26-4, సనా మీర్ 10-0-34-0, సాదియా యూసుఫ్ 10-2-30-2.
పాకిస్థాన్ ఇన్నింగ్స్: అయేషా జఫర్ ఎల్బీ-బి ఏక్తా బిస్త్ 1, నాహిదా ఖాన్ (సి) సుష్మా (బి) హర్మన్‌ప్రీత్ కౌర్ 23, జవేరియా ఖాన్ ఎల్బీ-బి జులాన్ గోస్వామి 6, సిద్రా నవాజ్ ఎల్బీ-బి ఏక్తా బిస్త్ ౦, ఇరమ్ జావిద్ ఎల్బీ-బి ఏక్తా బిస్త్ ౦, నైన్ ఆబిది (బి) దీప్తి శర్మ 5, అస్మావియా ఇక్బాల్ (సి) సుష్మా (బి) మాన్సి జోషి ౦, సనా మీర్ (బి) మాన్సీ జోషి 29, నశ్రా సంధు (సి) మాన్సీ (బి) ఏక్తా బిస్త్ 1, డయానా బేగ్ (బి) ఏక్తా బిస్త్ ౦, సాదియా యూసుఫ్ 3 నాటౌట్, ఎక్స్‌ట్రాలు 6, మొత్తం 38.1 ఓవర్లలో 74 ఆలౌట్.
బౌలింగ్: జులాన్ గోస్వామి 5-0-12-1, ఏక్తా బిస్త్ 10-2-18-5, దీప్తి శర్మ 10-2-21-1, మాన్సీ జోషి 6.1-2-9-2, పూనమ్ యాదవ్ 5-1-8-0, హర్మన్‌ప్రీత్ కౌర్ 2-0-6-1.