Friday, March 29, 2024

భారత మహిళల ఓటమి

- Advertisement -
- Advertisement -

Indian women's team loses second T20 match against Australia

 

క్వీన్స్‌లాండ్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, పూజా వస్త్రాకర్‌లు మాత్రమే రాణించగా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఓపెనర్లు స్మృతి మంధాన (1), షఫాలి వర్మ (3) నిరాశ పరిచారు. జెమీమా రోడ్రిగ్స్ (7), యస్తికా భాటియా (8), రిచా ఘోర్ (2) జట్టుకు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన హర్మన్ ఐదు ఫోర్లతో 28 పరుగులు చేసింది. ఇక కీలక పూజా వస్త్రాకర్ చివర్లో మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించింది. ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న వస్త్రాకర్ మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 37 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. దీంతో భారత్ స్కోరు 118 పరుగులకు చేరింది.

తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 19.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ బెత్ మూని 4 ఫోర్లతో 34 పరుగులు సాధించింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన మెక్‌గ్రాత్ ఆరు ఫోర్లత 42 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. జార్జియా రెండు ఫోర్లతో 10 (నాటౌట్) తనవంతు పాత్ర పోషించింది. భారత బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇక ఇరు జట్ల మధ్య చివరి టి20 ఆదివారం జరుగనుంది. ఇందులో గెలిచి భారత్ సిరీస్ సమం చేస్తుందా లేదా వేచి చూడాల్సిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News