Home తాజా వార్తలు ప్రత్యేకంగానే పెంచండి.. తప్పదు!

ప్రత్యేకంగానే పెంచండి.. తప్పదు!

Son

 

మనం కన్నబిడ్డల్లో ఆడ, మగ తేడాలేమిటీ? ఇద్దరూ ఒకటే… అమ్మాయి అబ్బాయి అన్న భేదం లేకుండా ఇద్దర్నీ సమానంగా స్వేచ్ఛగా పెంచుతాం అన్న భావనని మనసునిండా గాలి పీల్చుకున్నంత గాఢంగా పెంచుకుని చదువుల్లో, వాళ్లకి జీవితంలో దొరికే అవకాశాల్లో ప్రోత్సహిస్తూ వస్తున్నారు ఇప్పటి తల్లిదండ్రులు. కానీ కొత్తగా ఇవ్వాళ తల్లిదండ్రుల ముందున్న ఒక్క ప్రశ్న సమానంగా సరే అబ్బాయిని ఇంకా ప్రత్యేకంగా పెంచాలా? సమాజంలో ఉన్న ఒక భావజాలం నుంచి పిల్లవాడిని మేల్కొలిపేలా పెంచాలా? వారికి ఏం చెప్పాలి? ప్రత్యేకంగా ఒక బాలుడికి ఎదిగే వయసులో ఉన్న టీనేజర్‌కి స్త్రీల పట్ల ఎలా మెలగాలి, ఎందుకు గౌరవం ఇవ్వాలి? జీవిత కాలపు నేస్తాన్ని ఎంత జాగ్రత్తగా, నొప్పించకుండా మెలగాలి? ఈ ప్రపంచంలో నీతో పాటున్న ఇంకో జండర్ వ్యక్తిని ఏ దృక్కోణంతో ఎలా చూడాలో పసి వయసు నుంచి నేర్పుకుంటూ రావాలా? ఈ ప్రశ్నలకు ఔను అనే సమాధానం వస్తుంది.

యుగాల నుంచి పేరుకుంటూ వస్తున్న పురుషాధిక్య భావజాలం లోంచి పసివాడిని బయటకు లాక్కుని రావాలంటే అమ్మానాన్న ఎంత కష్టపడాలి? ముందు వాళ్లని వాళ్లు ఎలా మార్చుకోవాలి?

చూస్తూ నేర్చుకుంటారు : ఇంటి పెద్దలు ఏం చేస్తారో పిల్లలు అదే చేస్తారు. దాన్నే అనుకరిస్తారు. ఇంట్లో మంచి విలువలు, సంస్కారం నిండిన వాతావరణం ఉంటే పిల్లలు చక్కగా పెరుగుతారు. బాల్యంలో నేర్చుకున్న విలువలనే జీవితంలో ఆచరణలో పెడతారు. మగపిల్లవాడు పెరుగుతున్న ఇంట్లో… లేదా పిల్లలు పెరుగుతున్న ఇంట్లో తల్లిదండ్రులు కోపాన్ని భావోద్వేగాన్ని అదుపు చేయలేక పెద్దగా అరవటం, చేతిలో వస్తువులను విసిరి కొట్టటం.. ఇంకా కోపం వస్తే దాదాపుగా ప్రతి ఇంట్లో ఇంటికి పెద్దగా ఉన్న పురుషుడి చేతిలో ఆడవాళ్లు దెబ్బలు తినటం, తిట్లు తినటం చూస్తూనే ఉంటారు. చదువుకున్న భార్యాభర్తల్లో కూడా కోపం హద్దులు దాటితే ఎప్పటిదో మనసులో దాగి ఉన్న నేను మగవాడ్ని అన్న భావన పైకి లేస్తుంది. ఆ సందర్భంలో వాడే మాటలు, చేతలు చిన్న పిల్లలు చూస్తారు. అలాగే చుట్టూ ఉండే బంధువులు, స్నేహితులు, టీచర్లు, ఇరుగుపొరుగు వారితో ఇంట్లో పేరెంట్స్ మాట్లాడే తీరు, జడ్జిమెంట్ ఇచ్చే పద్ధతీ నేరుకుంటారు.

నగరంలో జరిగిన ఏదైనా అత్యాచార ఘటన పైన టి.వి.లో ఏదో చర్చాకార్యక్రమం నడుస్తూ ఉంటుంది. వెంటనే చిన్న పిల్లల ముందే ఆ సంఘటనకు స్త్రీలు కూడా వంద శాతం బాధ్యులే అంటూ ఉంటారు. వాళ్ల డ్రస్ కోడ్, మేకప్, వాళ్లు చేసే స్నేహాలు, వాళ్ల స్వేచ్ఛ సర్వం మాట్లాడతారు. ఒక పసివాడి మనసులో ఇదంతా రికార్డు అవుతూ ఉంటుంది. తండ్రి మాట్లాడే ప్రతి మాట, ప్రతి అలవాటు, చూసే దృక్కోణం ఇవన్నీ పిల్లవాడు తప్పని సరిగా ఫాలో అవుతాడు. యాభై శాతం కుటుంబాల్లో పురుషుడే సంపాదన పరుడిగా ఉంటాడు. అతను అనుభవిస్తున్న స్వేచ్ఛ, భార్య అతనికి అన్నీ పాదాల దగ్గరకు తీసుకువచ్చి అమర్చి పెడుతున్న తీరు, అతను చేసే పెత్తనం ఇవన్నీ పిల్లవాడికి పాఠాలు. రేపు నేను పెద్దయ్యాక నాన్నకులాగే ఇవన్నీ తీరికగా అనుభవిస్తాను. ఇలాంటి సేవలు నాకు దొరుకుతాయి. ఇలా నా పెత్తనం కొనసాగుతుంది అనుకుంటాడు. పిల్లవాడు పెరుగుతూ బయటి ప్రపంచంలో కాలు పెడుతూ ఉన్న సమయంలో వాడి మనసులో రూపం పోసుకున్న ఒక రూపం నేను అన్ని విధాలా అధికుడననే భావనే. స్త్రీ అన్ని విధాలా తనకంటే తక్కువ అన్న గాఢమైన అభిప్రాయమే. ఆమెపై ఆధికారం చేయటం తనకు హక్కుగా దొరికిందన్న ఉద్దేశ్యమే. ఇదే భావనలు ఇప్పటి వరకు ప్రత్యేకంగానే పెంచండి… తప్పదు!

మనం కన్నబిడ్డల్లో ఆడ, మగ తేడాలేమిటీ? ఇద్దరూ ఒకటే… అమ్మాయి అబ్బాయి అన్న బేధం లేకుండా ఇద్దర్నీ సమానంగా స్వేచ్ఛగా పెంచుతాం అన్న భావనని మనసునిండా గాలి పీల్చుకున్నంత గాఢంగా పెంచుకుని చదువుల్లో, వాళ్లకి జీవితంలో దొరికే అవకాశాల్లో ప్రోత్సహిస్తూ వస్తున్నారు ఇవ్వాల్టి తల్లిదండ్రులు. కానీ కొత్తగా ఇవ్వాళ తల్లిదండ్రుల ముందున్న ఒక్క ప్రశ్న సమానంగా సరే అబ్బాయిని ఇంకా ప్రత్యేకంగా పెంచాలా? సమాజంలో ఉన్న ఒక భావజాలం నుంచి పిల్లవాడిని మేల్కొలిపేలా పెంచాలా? వారికి ఏం చెప్పాలి? ప్రత్యేకంగా ఒక బాలుడికి ఎదిగే వయసులో ఉన్న టీనేజ్‌ర్‌కి స్త్రీల పట్ల ఎలా మెలగాలి, ఎందుకు గౌరవం ఇవ్వాలి? నీకో జీవిత కాలపు నేస్తాన్ని ఎంత జాగ్రత్తగా, నొప్పించకుండా మెలగాలి? ఈ ప్రపంచంలో నీతో పాటున్న ఇంకో జండర్ వ్యక్తిని ఏ దృక్కోణంతో ఎలా చూడాలో పసి వయసు నుంచి నేర్చుకుంటూ రావాలా? ఈ ప్రశ్నలకు ఔను అనే సమాధానం వస్తుంది. యుగాల నుంచి పేరుకుంటూ వస్తున్న ఒక పురుషాధిక్య భావజాలంలోంచి ఒక పసివాడిని బయటకు లాక్కుని రావాలంటే అమ్మానాన్న ఎంత కష్టపడాలి? ముందు వాళ్లని వాళ్లు ఎలా మార్చుకోవాలి?

చూస్తూ నేర్చుకుంటారు? ఇంటి పెద్దలు ఏం చేస్తారో పిల్లలు అదే చేస్తారు. దాన్నే అనుకరిస్తారు. ఇంట్లో మంచి విలువలు, సంస్కారం నిండిన వాతావరణం ఉంటే పిల్లలు చక్కగా పెరుగుతారు. బాల్యంలో నేర్చుకున్న విలువలనే జీవితంలో ఆచరణలో పెడతారు. మగపిల్లవాడు పెరుగుతున్న ఇంట్లో… లేదా పిల్లలు పెరుగుతున్న ఇంట్లో తల్లిదండ్రులు కోపాన్ని భావోద్వేశాన్ని అదుపు చేయలేక పెద్దగా అరవటం చేతిలో వస్తువులను విసిరి కొట్టటం.. ఇంకా కోపం వస్తే దాదాపుగా ప్రతి ఇంట్లో ఇంటికి పెద్దగా ఉన్న పురుషుడి చేతిలో ఆడవాళ్లు దెబ్బలు తినటం, తిట్లు తినటం, చూస్తూనే ఉంటారు. చదువుకున్న భార్యాభర్తల్లో కూడా కోపం హద్దులు దాటితే ఎప్పటిదో మనసులో దాగి ఉన్నా నేను మగవాడ్ని అన్న భావన పైకి లేస్తుంది. ఆ సందర్భంలో వాడే మాటలు, చేతలు చిన్న పిల్లలు చూస్తారు. అలాగే చుట్టూ ఉండే బంధువులు, స్నేహితులు, టీచర్లు, ఇరుగుపొరుగు వారితో ఇంట్లో పేరేంట్స్ మాట్లాడే తీరు, జడ్జిమెంట్ ఇచ్చే పద్ధతీ నేరుకుంటారు. నగరంలో జరిగిన ఏదైనా అత్యాచార ఘటన పైన టి.వి.లో ఏదో చర్చాకార్యక్రమం నడుస్తూ ఉంటుంది.

వెంటనే చిన్న పిల్లల ముందే ఆ సంఘటనకు స్త్రీలు కూడా వంద శాతం బాధ్యులే అంటూ ఉంటారు. వాళ్ల డ్రస్ కోడ్, మేకప్, వాళ్లు చేసే స్నేహాలు, వాళ్ల స్వేచ్ఛ సర్వం మాట్లాడతాడు. ఒక పసివాడి మనసులో ఇదంతా రికార్డు అవుతూ ఉంటుంది. తండ్రి మాట్లాడే ప్రతి మాట, ప్రతి అలవాటు, చూసే దృక్కోణం ఇవన్నీ పిల్లవాడు తప్పని సరిగా ఫాలో అవుతాడు. యాభై శాతం కుటుంబాల్లో పురుషుడే సంపాదన పరుడిగా ఉంటాడు. అతను అనుభవిస్తున్న స్వేచ్ఛ, భార్య అతనికి అన్నీ పాదాల దగ్గరకు తీసుకువచ్చి అమర్చి పెడుతున్న తీరు, అతను చేసే పెత్తనం ఇవన్నీ పిల్లవాడికి పాఠాలు. రేపు నేను పెద్దయ్యాక నాన్నకు లాగే ఇవన్నీ తీరికగా అనుభవిస్తాను. ఇలాంటి సేవలు నాకు దొరుకుతాయి. ఇలా నా పెత్తనం కొనసాగుతుంది అనుకుంటాడు. పిల్లవాడు పెరుగుతూ బయటి ప్రపంచంలో కాలు పెడుతూ ఉన్న సమయంలో వాడి మనసులో రూపం పోసుకున్న ఒక రూపం నేను అన్ని విధాలా అధికుడననే భావనే. స్త్రీ అన్ని విధాలా తనకంటే తక్కువ అన్న గాఢమైన అభిప్రాయమే.

ఆమెపై ఆధికారం చేయటం తనకు హక్కుగా దొరికిందన్న ఉద్దేశ్యమే. ఇదే భావనలు ఇప్పటి వరకు సమాజంలో కొనసాగుతున్నాయి. తండ్రి చాలా సహజంగా నీకేం తెలియదు, నోర్మూసుకో అని భార్యని అంటూనే ఉంటాడు. ఆమె గొణుక్కుంటూనే సహిస్తూనే ఉంటుంది. అతి చిన్న కారణంతో కుటుంబ బంధాలు, బాధ్యతలు, వదిలించుకుని పోయి సుఖంగా ఇంకో జీవితాన్ని నిర్మించుకున్న ఇతర మగవాళ్లని గురించి చూస్తారు, వింటారు. “అది తప్పు నీకు అలాంటి హక్కులేదు. నువ్వు ఏ కారణం చేతనూ నీ భార్యాబిడ్డలను వదిలేహక్కులేదు. నువు నీ భార్యను కొట్టటం, నేరం. ఇతర ఆడవాళ్లను అవమానకరమైన దృష్టితో చూడటం నేరం” అని ఎవ్వరూ మగవాడిని దండించక పోవటం చూస్తారు. మనం ఏం చేసినా చెల్లుతుందనే భావన పిల్లవాడిలో కలుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి పరిస్థితుల్లో, ఇప్పుడున్న సమాజంలో పిల్లవాడి పెంపకంలో తల్లిదండ్రులు ప్రతేక శ్రద్ధ తీసుకోవాలి.

పెద్దవాళ్ల సంరక్షణ ముఖ్యం : ఇప్పుడున్న రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితమే కాబట్టి పిల్లలను విలువలతో పెంచాలంటే మనకి నమ్మకస్తులైన, ఎంతో ప్రియమైన గ్రాండ్ పేరెంట్స్ చేతుల్లో పెట్టటం మొదటి పని. ఇంట్లో పెద్దవాళ్ల మధ్యన పెరిగితే పిల్లల వ్యక్తిత్వం ఎంతో వికసిస్తుంది. మంచి సంస్కారాన్ని అందించగలిగేది అనుభవంలో ఉన్న పెద్దవాళ్లే. అమ్మాయి, అబ్బాయి తేడా అందరికి స్మార్ట్‌ఫోన్‌లు, గ్యాడ్జెట్లు, వీడియోగేమ్స్ అందుబాటులో ఉంటున్నాయి. అందులో కనబడే భావజాలంతోనే పెద్దవాళ్లు అవుతున్నారు. ముఖ్యమైన మాధ్యమాలు సినిమాలు సీరియల్స్, టి.వి.లో వచ్చే కొన్ని కార్యక్రమాలు పిల్లల దృష్టి కోణాన్ని మారుస్తున్నాయి. చాలా సహజంగా టి.వి.లో కనిపించే కుల పోరాటాలు, పరువు హత్యలు, వాటిపైన జరిగే డిస్కషన్లు ఏవీ ఆడపిల్లను గౌరవంతో సమానంగా చూస్తున్న క్రమంలో ఉండవు. ఇంటి మర్యాదకు గుర్తింపుగా మాత్రమే కనిపిస్తుంది. ఆమెను కంట్రోల్ చేయవచ్చు. భయపెట్టవచ్చు వినకపోతే ఏ రకమైన హింసతో అయినా ఆమెను అణిచి ఉంచవచ్చనే భావనే చాలా సహజంగా కలుగుతుంది. ఈ వాతావరణంలోంచి ఈ ఆలోచన లోంచి మగపిల్లవాడిని బయటకు తెచ్చి తన తోటి ఆడపిల్లను సమానంగా, స్నేహితులుగా, తనలాంటి వ్యక్తేననే దృష్టితో చూసేందుకు తల్లిదండ్రులు బిడ్డలను ప్రత్యేకంగా పెంచాలి.

ఈ తరంలో మగపిల్లల తల్లిదండ్రులకు ఇదో సవాల్ వంటిదే. పిల్లవాడిని చుట్టూ వాతావరణంలో పేరుకుపోయి ఉన్న నేను ప్రత్యేకమనే ఆలోచన లోంచి బయటకి తేవాలి. స్త్రీల పట్ల ఎలాంటి భావనతో ఉండాలో నేర్పాలి. నువ్వు ఏ తల్లి ఒడిలో పెరుగుతున్నావో, ఆమెను ఎంత గౌరవిస్తున్నావో, ఆమె లాంటి వాళ్లే ఇతర స్త్రీలంతా అని నూరిపోస్తూ పెంచాలి. ఎప్పటిదో ఒక ఆటవిక న్యాయం ఉంది. బలవంతుడిదే రాజ్యం అని… దానికి కాలం చెల్లిందని అనుకుంటూ ఉన్నాం. కానీ అది ఇంకో రూపంలో మన శరీరానికి, సంతోషాన్నిచ్చే స్త్రీల విషయంలో అందుబాటులోనే ఉంది. ఈ అంశాన్ని పిల్లవాడికి బోధ పరచాలి. ఆడపిల్లల విషయంలో వాళ్లు కేవలం లైంగిక సుఖాన్ని ఇవ్వగలవాళ్లు మాత్రమే కాదనీ, నీతో సమానమైన వాళ్లనే అభిప్రాయం కలిగేలా పెంచాలి.

నిజానికి ఇప్పటివరకు సమాజంలో అమల్లో ఉన్న ఎన్నో విషయాలు ముఖ్యంగా స్త్రీల విషయంలో మగవాడి దృష్టికోణం అన్నీ బద్దలుకొట్టేలాగా పసివాడిలో ఆలోచన రేకెత్తించాలి. ఒక బాలుడు, తన తోబుట్టువుని లేదా తోటి బాలికను కేవలం తనవంటిదేనని, ఆమెను ఇంకెటువంటి దృష్టితోనూ చూడటం పొరపాటని అనుకునేలా పెంచాలి. పసిపిల్లలు నిజానికి మట్టి ముద్దల్లాంటి వాళ్లే. వాళ్లని ఏ రూపంలో మలుచుకోవాలి అనేది చేతిలో పని. ఒక తల్లి తన ఒడిలో ఉన్న పసివాడిని తోటివాళ్లని గౌరవించే, ప్రేమించే ఉత్తమ సంస్కారంతో పెంచాలని నిర్ణయించుకోవాలి. ఒక తండ్రి నా బిడ్డ సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరుడు కావాలి. గుణవంతుడిగా పెరగాలని ఆశించాలి. చుట్టూ జరుగుతున్న ఎన్నో దురాగతాలను దాచి పెట్టకుండా వాళ్లకి చెపుతూ, హెచ్చరిస్తూ, అలాంటి దుషార్యాలు చేయటం ఎంత హీనమైన విషయమో బోధించాలి. బాల్యంలో యుక్త వయసులో తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న సంస్కారాల ప్రభావం పిల్లలపైన జీవితాంతం ఉంటుంది. ముందు మంచి తల్లిదండ్రులుగా మారాలి. ఉత్తమమైన పౌరులుగా ఉండాలి. అప్పుడు పిల్లల్ని పెంచాలి. తల్లిదండ్రులకు దర్పణం పెరిగే పిల్లలు!! దీనికి ఏ కోర్సులు ఉండవు. నేను మనిషిని అని ఎవరికి వాళ్లు తెలుసుకోవటం… అంతే!!

– సి. సుజాత

Indians prefer sons rather than daughters