Friday, April 19, 2024

హెచ్‌సిఐలో ఇండియా ర్యాంక్ 116

- Advertisement -
- Advertisement -

India's 116th position in the Human Capital Index

వాషింగ్టన్ : హ్యుమన్ క్యాపిటల్ ఇండెక్స్‌లో భారతదేశం ఇప్పుడు 116వ ర్యాంక్‌లో నిలిచింది. ఈ విషయం ప్రపంచ బ్యాంక్ తాజా వార్షిక నివేదికలో వెల్లడైంది. ప్రపంచ దేశాల స్థాయిల్లో హ్యుమన్ క్యాపిటల్ ప్రామాణికత లెక్కింపులో ఈ కొలమానం ఉపయుక్తం అవుతుంది. 2018లో ఈ విషయంలో ఇండియా స్కోర్ 0.44 శాతంగా ఉంది. ఇప్పుడది 0.49కు చేరిందని వెల్లడించారు. ఆరోగ్య, విద్యా ప్రగతి తదితర విషయాలను ప్రామాణికంగా తీసుకుని ఈ సూచీని లెక్కకడుతారు. ఈ 2020 హెచ్‌సిఐ ఆధునీకరణ ప్రక్రియను మొత్తం 174 దేశాలలో పరిస్థితిని విశ్లేషించుకుని లెక్కకట్టారు. ప్రపంచ జనాభాపరంగా చూస్తే మొత్తం 98 శాతం వరకూ జనం ఆరోగ్య విద్యా ఇతరత్రా ప్రమాణాలను లెక్కకట్టేందుకు ఈ సూచీ ఉపయుక్తం అవుతుంది. ఈ ఏడాది మార్చి వరకూ ఉన్న కాలాన్ని లెక్కలోకి తీసుకుని ఈ సూచీని రూపొందించారు. తక్కువ ఆదాయపు దేశాల్లో గణనీయ ప్రగతి కనబడినట్లు గుర్తించారు.

India’s 116th position in the Human Capital Index

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News