Tuesday, April 16, 2024

ఇండియా గేట్ వే నుంచి బేలాపూర్‌కు ‘వాటర్ ట్యాక్సీ’ (వీడియో)

- Advertisement -
- Advertisement -
200 మంది ప్రయాణికులతో గంటకు 20-25కిమీ. వేగంతో,  రూ. 300 ధరతో ‘వాటర్ ట్యాక్సీ’ ప్రయాణం

ముంబై: ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ నుంచి నవీ ముంబైలోని బేలాపూర్ వరకు ‘నయన్ 11’ అనే వాటర్ ట్యాక్సీని నడుపబోతున్నట్లు నయన్‌తారా షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కెప్టెన్ రోహిత్ సిన్హా ప్రకటించారు. వచ్చే వారం నుంచి ఆ ట్యాక్సీని సముద్ర మార్గం ద్వారా నడుపబోతున్నట్లు ఆయన తెలిపారు. ప్రయాణించేప్పుడు ఎయిర్-కండిషన్డ్ క్యాబిన్‌లతో కూడిన లగ్జరీ అనుభవాన్ని ప్రయాణికులకు అందిస్తామన్నారు. రూ. 300 ఆఫర్డబుల్ ధరకే ప్రయాణం అందించబోతున్నామన్నారు. ఈ ‘వాటర్ ట్యాక్సీ’ గంటకు 2025 కిమీ. వేగంతో ప్రయాణిస్తుంది. ఒక ట్రిప్‌లో 200 మంది కూర్చుని ప్రయాణించవచ్చు. రోడ్డు ప్రయాణించే దానికంటే ఈ వాటర్ ట్యాక్సీ ద్వారా గంట సమయం ఆదా అవుతుంది.

కార్యాలయాలకు వెళ్లేవారికి(ఆఫీస్ గోయర్స్‌కు) ముంబై నుంచి నవీ ముంబైకు ఈ వాటర్ ట్యాక్సీ ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. ముంబైలో ప్రతిరోజు ఆఫీసుకు వెళ్లేవారు పెద్ద సంఖ్యలో ఉంటారు. అయితే ఇలా ఆఫీసుకు రోజు వెళ్లే వారికి 20 శాతం డిస్కౌంట్ కూడా ఇస్తామని సిన్హా తెలిపారు. అయితే ఈ పాస్ కేవలం వారంలో ఆరు రోజులే పనిచేస్తుంది, వీకెండ్స్(వారాంతం)కాదు. మంత్లీ పాస్ తీసుకునేవారు 2122 రోజులే ఈ పాస్‌ల ద్వారా ప్రయాణించొచ్చు. భౌ చ ధక్క డొమెస్టిక్ క్రూయీజ్ టెర్మినల్(డిసిటి) నుంచి మాండ్వా వరకు వారాంతాలలో ఈ వాటర్ ట్యాక్సీ నడుస్తుంది. ముంబై నుంచి అలీబాగ్ వరకు ప్రయాణికులు ఈ వాటర్ ట్యాక్సీ ద్వారా ప్రయాణించొచ్చు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News