Saturday, September 30, 2023

అనేక రాష్ట్రాల్లో 1 దాటిన ఆర్ ఫ్యాక్టర్

- Advertisement -
- Advertisement -

India's R-Factor exceeding 1 in many states

న్యూఢిల్లీ : దేశంలో డెల్టా వేరియంట్ ఉధృతి కొనసాగుతోంది. అనేక రాష్ట్రాల్లో ఆర్ ఫ్యాక్టర్ 1 దాటింది. అది 1 దాటడమంటే కొవిడ్ ఆందోళన కరంగా మారుతున్నట్లేనని కేంద్రం ఇదివరకే ఆందోళన వెలిబుచ్చింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆర్ ఫ్యాక్టర్ రేటు 1.01గా ఉంది. అంటే ఒక వ్యక్తి నుంచి వైరస్ ఒకరి కంటే ఎక్కువ మందికి సోకుతుందని అర్ధం. రెండో దశలో దాదాపు 1.4 కి చేరిన ఆర్ ఫ్యాక్టర్ తర్వాత 0.7 కి తగ్గింది. కానీ మూడో ముప్పు పొంచి ఉన్న వేళ ఇది 1.01 కి చేరడం ఆందోళన కలిగిస్తోంది. అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో ఆర్ ఫ్యాక్టర్ 1.34గా ఉంది. తరువాత హిమాచల్ ప్రదేశ్‌లో 1.3, నాగాలాండ్‌లో 1.09 ఉంది. అత్యధిక కేసులు నమోదవుతున్న కేరళలో మాత్రం అది 1.06 గా ఉండడం గమనార్హం. అయితే ప్రతి రాష్ట్రం లోనూ కొవిడ్ తీవ్రత ఆర్‌ఫ్యాక్టర్‌కు అనుగుణంగా ఉండక పోవచ్చని నిపుణులు వెల్లడించారు.

India’s R-Factor exceeding 1 in many states

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News