Friday, July 18, 2025

గువాహటి నుంచి చెన్నైకి వెళ్లే విమానానికి తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

ఇండిగో సంస్థకు చెందిన ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. గురువారం (జూన్ 19న) గువాహటి నుంచి చెన్నై వెళ్లాల్సిన ఇండిగో విమానం (Indigo Flight) తృటిలో ప్రమాదం నుంచి బయటపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం సాయంత్రం 4.40 గంటలకు ప్రయాణికులతో బయలుదేరిన ఇండిగో 6ఈ 6764 టేకాఫ్ అయింది. అయితే కొంత సమయానికే విమానంలో ఇంధనం లేనట్లు పైలట్ గురించి ఎటిసికి ‘మేడే’ సందేశం పంపించారు. అయితే చెన్నై విమానాశ్రయంలో రద్ధీ ఎక్కువ ఉన్న కారణంగా విమానాన్ని బెంగళూరు విమానాశ్రయంలో రాత్రి 8.15 గంటలకు సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. వైద్య, అగ్నిమాపక సేవలతో అత్యవసర సేవల బృందాలను మోహరించారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 168 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News