Friday, April 26, 2024

ఇండిగో నష్టం రూ.871 కోట్లు

- Advertisement -
- Advertisement -

indigo Reports Net Loss Of ₹ 871 crore

న్యూఢిల్లీ: మార్చి ముగింపు నాటి నాలుగో త్రైమాసిక ఫలితాల్లో ప్రైవేటు విమానయాన సంస్థ ఇండిగో నిరాశపర్చింది. ఇండిగో నికర నష్టం రూ.870 కోట్లు నమోదైంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 201920 క్యూ4(జనవరిమార్చి)లో సంస్థపై తీవ్ర ప్రభావం పడింది. అయితే గతేడాది (201819) నాలుగో త్రైమాసికంలో సంస్థకు రూ.589 కోట్ల లాభం వచ్చింది.

ఇక 2019 డిసెంబర్ ముగింపు నాటి త్రైమాసికంలోనూ సంస్థ రూ.496 కోట్ల లాభం చూసింది. కోవిడ్19 కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో విమాన సేవలను నిలిపివేయగా, ఇది సంస్థ ఆదాయానికి గండికొట్టింది. అయితే క్యూ4లో ఇండిగో కేవలం కొత్త 5 విమానాలను తన జాబితాలో చేర్చుకోవడంతో మొత్తం 257 నుంచి 262కు చేరాయి. ఇక పూర్తి సంవత్సరానికి గాను విమాన సంస్థ నికర నష్టం రూ.233 కోట్లుగా ఉంది.

indigo Reports Net Loss Of ₹ 871 crore

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News