Home కుమ్రం భీం ఆసిఫాబాద్ ఇందిరమ్మ ఇళ్ల పేరిట నిధుల స్వాహా

ఇందిరమ్మ ఇళ్ల పేరిట నిధుల స్వాహా

ముగ్గురు లబ్ధిదారుల పేరిట రూ. 70వేలు గోల్‌మాల్

Indiramma-House

సిర్పూర్(యు): ఇందిరామ్మ ఇళ్లపేరిట స్వాహా ఉదంతలు ఇంకా వె లుగు చుస్తున్నాయి.2013-14లో ప్రభుత్వం గ్రామాలకు ఇళ్లను మంజూరు చేయ గా మధ్య దళారులు ఇళ్లను నిర్మించారు. అయితే మండలంలోని చిలటిగూడలో ము గ్గురు గిరిజన లబ్ధిదారుల పేరిట సుమారు రూ. 70వేల బిల్లులను స్వాహా చేయగా ఇళ్లు మాత్రం ఇంత వరకు నిర్మాణం కాలేదు. గ్రామానికి చెందిన ఉయిక పంచుబా యి, తుర్ప బాయి, చిత్రం గోదుబాయి కుటుంబీకులు బుధవారం మండల కేంద్రాని కి తరలివచ్చి జరిగిన ఉదంతంపై విలేకరుల ముందు గోడును వెలబుచ్చారు.

ఉయిక పంచుబాయి పేరిట 22వేల 800, తుర్పబాయి పేరిట 23వేలు, చిత్రం గోదుబాయి పేరిట 22వేల500 రూపాయలు అదే పంచాయతీకి మాజీ జడ్పీటీసీ జుగజి రావ్ తమ పేరిట అకౌంట్లనుంచి డ్రా చేసుకున్నాడని తెలిపారు. తమకు మాత్రం వెయ్యి రూపాయాలు ఇచ్చారని తెలిపారు. ఇళ్ల నిర్మాణం జరగకపోగ ప్రభుత్వ ఇచ్చిన డ బ్బులను మాత్రం పోగోట్టుకున్నామన్నారు. తమకు న్యాయం చేయాలని ఈ సంద ర్భంగా వారు కోరారు. ఇదే విషయమై తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశామన్నారు. విచా రణ చేపట్టి న్యాయం చేయాలన్నారు. ఈ విషయమై మాజీ జడ్‌పిటిసి జుగజీరావును వివరణ కోరాగా త్వరలోనే ఇళ్లు కట్టిస్తానని పని భారం కారణం గా జాప్యం జరిగిన మాట వాస్తమేనని అన్నారు. ముగ్గురి లబ్ధిదారుల ఇళ్లు త్వరలోనే కట్టిస్తానని చెప్పుకోచ్చారు.