Home ఎడిటోరియల్ భారత్-అమెరికా భావిసంబంధాలు!

భారత్-అమెరికా భావిసంబంధాలు!

Cartoonsభారత- అమెరికా సంబంధాలను నిర్వచిస్తూ వాటిని ‘ ప్రయో జనకరమైన మిత్ర దేశాలుగా’ వైట్ హౌస్ సీనియర్ అధికారి పీటర్ లెవోయ్ ఇటీవల అభివర్ణించారు. ఆయన వైట్ హౌస్‌లో దక్షిణాసియా వ్యవహారాల అత్యున్నత అధికారి. దేశాలతో సంబంధాలను పెంపొందించుకోవడంలో స్వయం నిర్ణయాధికారం నిలబెట్టుకోడానికే క్లిష్ట సమయాల్లో కూడా భారత్ పాటుపడిందని ఆయన గుర్తు చేశారు. కూటములు కట్టే ఆనవాయితీ రోజుల్లో కూట ములకు దూరంగా ఉంటూనే మిత్రత్వాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రవర్తిస్తున్న భారత్ నమూనా సంతృప్తిని ఇస్తుందని కూడా లెవోయ్ అన్నారు. కూటములను కట్టడం తప్పనిసరిఅని అమెరికా ప్రభుత్వం గాని, భారత ప్రభుత్వంగాని భావించడం లేదు. కూటమి సభ్యత్వం లేని భారత్‌ను ‘ప్రధాన రక్షణ భాగస్వామి’గా అమెరికా ప్రకటించిన విషయాన్ని ఆయన ఉదహరించారు. కూటమి భాగస్వామ్య దేశాల మధ్య ఉండే ప్రయోజనాలను ఇరు దేశాలు పంచుకొంటున్నాయి. అయితే అమెరికాతో భారత వ్యాఖ్యానిస్తూ ‘భారత్ అల్లుతున్న వస్త్రాన్ని ధరించడానికి అమెరికా సిద్ధంగా లేదు’ అని రష్యా వ్యాఖ్యానించడాన్ని నివేదిక ప్రస్తావించింది.

రక్షణరంగంలో ఎఫ్‌డిఐలు కీలకం
భారత్‌తో అమెరికా సంబంధాలు మెరుగుపడ్డానికి ఆరు అంశా ల్లో విధిగా జరగాల్సిన చర్యలను ఇటీవల ఒక కొత్త అధ్యయన నివేదిక ఒకటి పేర్కొంది. వ్యూహాత్మక, అంతర్జాతీయ అధ్యయనాల కేంద్రం (సిఎస్‌ఐఎస్) ఈ నివేదికను ‘అమెరికా – భారత్ భద్రతా సహకారం: ప్రగతి, వచ్చే ప్రభుత్వానికి హామీలు’ పేరిట రూపొం దించింది. ఈ నివేదిక విడుదల సందర్భంలో లెవోయ్ కీలక ప్రసం గం చేస్తూ భారత్‌తో సంబంధాల్లో ఒబామా పాలన విజయా లను ఏకరువుపెట్టారు. గత ఎనిమిదేళ్లుగా రక్షణ రంగంలో భారత్ అమెరికాల సంబంధాలు పరిపక్వత దిశగా పుంజుకొన్నాయని ఆయన ప్రత్యేకంగా చెప్పారు. విమాన చోదక నౌక తయారీకి సహకరించే విషయంలో అమెరికా ఏ ఇతర దేశాన్నీ చేరదీయలేదని ఆయన నొక్కి చెప్పారు. ఉభయ దేశాల మధ్య ఆయుధాలకు సంబంధించిన సాంకేతిక విజ్ఞానం, వాణిజ్య రంగంలో సంబంధాలు పురోగమిస్తున్నట్లు ఆయ న చెప్పారు. రక్షణ రంగంలో వాణిజ్యం గత పదేళ్లలో శూన్యం నుంచి 1500 కోట్ల డాలర్లకు చేరింది. లైసెన్సుల ఆమోదం రేటు 99 % అయింది. సముద్ర సరిహద్దుల భద్రతా ంశాలపై చర్చలు సాగు తున్నాయి. అణు ఇంధన రియాక్టర్లను నిర్మించే దిశగా ఉభయ దేశాల మధ్య సంప్రదింపుల ప్రక్రియ ఖరారు దశకు వచ్చింది. వెస్టింగ్ హౌస్ ఆ రియాక్టర్లను నిర్మించే అవకాశం ఉంది. ఆఫ్ఘని స్థాన్‌పై కూడా చర్చల పర్వం తిరిగి మొదలయింది. ఇవన్నీ ఒబామా పాలన సాధించిన విజయాలుగా లెవోయ్ పేర్కొ న్నారు. ప్రారంభం, ముగింపులో జవహర్ లాల్ నెహ్రూను ఉటం కిస్తూ ఆయన మాట్లాడారు. ఈ కాలంలో ఇది కొంత ఆశ్చర్య కర మైన విషయమే. ప్రపంచ వ్యవహారాల్లో కొంత ఆలస్యంగానైనా భారత్‌కు ప్రాధాన్యం పెరగడంపట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వాతావరణ మార్పుల ఒప్పందంపై భారత్ సంతకాన్ని అమెరికా లో అంతా హర్షిస్తున్నారు. అయితే భారత్‌కు దక్కవలసిన ఎన్‌ఎస్‌జి గ్రూపు ( అణు ఇంధన పరికరాల సరఫరా బృందం) సభ్యత్వం వ్యవ హారం ఇంకా తెమలకుండా మిగిలిందని గుర్తుంచుకోవాలి. ఈ నేపథ్యంలో అమెరికాలో నవంబర్ ఎన్నికల తరువాత వచ్చే కొత్త ప్రభుత్వం భారత్ విషయంలో ఎటువంటి ప్రాధాన్యాలను అనుసరిం చాలి అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఇందుకు సిఎస్‌ఐఎస్ నివేదిక విధిగా జరగవలసిన ఆరు అంశాలను స్పష్టం చేసింది.

ఆరు అంశాలలో జాగ్రత్త అవసరం
కొత్త అధ్యక్షుడు భారత ప్రధాని నరేంద్ర మోడీని అధికారం చేపట్టిన మొదటి వంద రోజుల్లోగా కలుసుకోవాలి; ఉభయ దేశాల సంబంధాల ప్రాముఖ్యాన్ని వివరించి ఇంకా మిగిలి ఉన్న మౌలిక ఒప్పందాల కొన్నింటిపై భారత పొందా లి; ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టుకొమ్మలయిన అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా మధ్య చర్చల పర్వాన్ని నెలకొల్పాలి; హిందూ మహాసముద్రంలో భారత్ నౌకాదళ సామర్థాన్ని పెంచాలి; రక్షణరంగంలో నేరుగా విదేశీపెట్టుబడుల (ఎఫ్‌డిఐ)ను నూటికి నూరు శాతానికి పెంచేలా భారత్‌ను ప్రోత్స హిం చాలి; ‘హోం లాండ్ సెక్యూరిటీ డైలాగ్ (హెచ్ ఎస్ డి)’ క్రింద సాంకేతిక సహకారాన్ని విస్తరించాలి. ఈ లక్షాల సాధనలో దారిపొడుగునా అడ్డంకులు ఎదురుకావచ్చు. పాకిస్థాన్‌తో సన్నిహి తంగా మెలుగుతున్న అమెరికాపట్ల భారత్‌కుగల భయాలు, రష్యాతో భారత్‌కుగల సాన్నిహిత్యంపట్ల అమెరికాకుగల భయాలు ముఖ్యమైన సవాళ్ళుగా పరిణమించవచ్చునని నివేదిక పేర్కొంది. అఫ్ఘనిస్థాన్‌లో ఉనికిని తగ్గిచుకోవాలనే అమెరికా యోచిస్తు న్నందున పాకిస్థాన్ ప్రాధాన్యత కూడా దాంతోపాటే తగ్గిపోతుందని నివేదిక ఊహాగానం చేసింది. అక్కడితో ఆగకుండా ఆ దేశం టెర్రరి జానికి ఆశ్రయమిస్తున్న కారణంపై అమెరికా దానితో తన సంబం ధాలను తెంచుకొనే అవకాశం ఉందని కూడా నివేదిక తెలి పింది. అయితే పాకిస్థాన్‌తో అమెరికా కొనసాగిస్తున్న సైనిక సహ కారం వల్ల భారత్, అమెరికా మధ్య పరస్పర విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉందని కూడా సిఎస్‌ఐఎస్ నివేదిక హెచ్చరించింది. ఆఫ్ఘన్ నుంచి అమెరికా వైదొలగిన సందర్భంలో ప్రాంతీయ శాంతి స్థాపన కోసం భారత్, చైనా మధ్య సహకార ఒప్పందం కుదరవచ్చని నివేదిక సూచించింది. మిత్రదేశమైన పాకిస్థాన్ అభిమతానికి విరుద్ధంగా చైనా నడుచుకోడానికి చైనా సిద్ధమైనప్పుడే ఇది సాధ్యమవుతుంది! అయితే అందుకు విరుద్ధమైన పరిణామం చోటు చేసుకుంటున్నట్లు కనిపిస్తోందని పేర్కొంది. అదేమిటంటే ఆసియాలో చైనా – రష్యా – పాకిస్థాన్ చెలిమి. అదే జరిగితే భారత్, అమెరికాకు కొత్త సవాళ్లు ఖాయం. అయితే ఇటువంటి పర్యవసానం సంకేతాలు ప్రస్తుతానికి లేవు.

ఎంటిసిఆర్‌ పట్ల ఇంకా అవగాహన లేని భారత్
భారత్, అమెరికా ‘ప్రయోజనకరమైన మిత్రదేశాలు’ అన్న లెవోయ్ వ్యాఖ్యను మరింతగా విశ్లేషిస్తే చాలా అంశాలు గోచరి స్తున్నాయి. ముఖ్యంగా భారత్‌ను అధిక ప్రయో జనాలు పొందుతున్న దేశంగా అమెరి కా భావిం చాలని నివేదిక సూచించింది. అమెరికా రూపొం దించిన మానవ రహిత యుద్ధ విమానం ‘ప్రిడేటర్’ కొనడంపట్ల భారత్ ఆసక్తిని ఉదహరిం చింది. క్షిపణి సాంకేతిక విజ్ఞానం వ్యాప్తి నిరోధ వ్యవస్థ (ఎంటిసిఆర్) లో భారత్ చేరినప్పటికీ దాని బాధ్య తలపట్ల దానికి ఇంకా అవగాహన ఏర్పడ లేదని నివేదిక భావించింది. ఎంటిసిఆర్ క్రింద తన సొంత బాధ్యతలపట్ల అమెరికా ఆందో ళనతో ఉందని, అందుకే ఎంటిసిఆర్ పరిధి లోని దేశాలకు కూడా ఆ విజ్ఞానాన్ని అందించడానికి నిరాకరిం చిందని నివేదిక పేర్కొంది. భారత్‌తో సంబంధాల్లో రక్షణ రంగం ఎఫ్‌డిఐల అంశం అత్యం త ప్రాముఖ్యమైనదని నివేదిక పేర్కొంది. ఎందు కంటే దానిని వందశాతానికి పెంచితే అమెరికా ఆయుధ కంపెనీల గుప్పిట్లో ఇరుక్కుంటామనే భారత్ భయాలను ముందుగా తొలగించాలని రాబోయే అమెరికా ప్రభుత్వానికి సిఎస్‌ఐఎస్ నివేదిక సూచించింది.

-సీమా శిరోహి