Home తాజా వార్తలు సెమీఫైనల్లో సింధు

సెమీఫైనల్లో సింధు

Pv-Sindhu

ఇండోనేషియా ఓపెన్
జకర్తా: ప్రతిష్టాత్మకమైన ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు సెమీఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి నజోమి ఒకుహారా (జపాన్)ను ఓడించింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సింధు 2114, 217 తేడాతో ఒకుహారాను ఓడించింది. ప్రారంభం నుంచే సింధు దూకుడును ప్రదర్శించింది. చూడచక్కని షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. కళ్లు చెదిరే షాట్లతో ఒకుహారాను కోలుకోనివ్వలేదు. ఇంతకుముందు సింధుతో జరిగిన మ్యాచుల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన నజోమి ఈసారి మాత్రం పూర్తిగా విఫలమైంది. సింధుకు కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయింది. తన మార్క్ ఆటతో అలరించిన సింధు అలవోకగా మొదటి గేమ్‌ను సొంతం చేసుకుంది. తర్వాతి సెట్‌లో సింధు మరింత చెలరేగి పోయింది. ఈసారి మరింత దూకుడును ప్రదర్శించింది. ఒకుహారాకు ముచ్చెమటలు పట్టిస్తూ ముందుకు సాగింది. ఇదే క్రమంలో అలవోకగా సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుని సెమీఫైనల్‌కు చేరుకుంది. ఈ సీజన్‌లో అత్యంత పేలవమైన ఆటతో నిరాశ పరిచిన సింధు ఎలాగైన ఇండోనేషియా ఓపెన్ గెలుచుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది.
ఇందులో భాగంగానే ఇప్పటి వరకు నిలకడైన ఆటతో సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.

Indonesia Open 2019 Quarter Finals