Friday, March 29, 2024

ఇండోనేసియా సుమత్ర ద్వీపంలో పేలిన అగ్నిపర్వతం

- Advertisement -
- Advertisement -

Indonesia Sinabung Volcano eruption in Sumatra Island

మెడన్(ఇండోనేసియా): ఇండోనేసియా సుమత్ర ద్వీపంలో సోమవారం సినాబంగ్ అగ్ని పర్వతం పేలి 16,400 అడుగులు (5000 మీటర్లు) ఎత్తున బూడిద ఆకాశంలో పైకెగసింది. అయితే, ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఎవరూ గాయపడడం కానీ జరగలేదని ఇండోనేసియా అగ్నిపర్వత, భౌగోళిక ప్రమాద నివారణ కేంద్రం వెల్లడించింది. లావా ప్రవాహం నుంచి తప్పించుకోడానికి గ్రామస్థులు ఐదు కిమీ దూరం వరకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఈ అగ్ని పర్వతం చుట్టూ ఉన్న వారిలో దాదాపు 30 వేల మందిని గత కొన్నేళ్లుగా తరలించారు. 20 కిమీ పొడవున గ్రామాలపై దట్టమైన బూడిద పొరలు ఆవరించాయని అర్మెన్ పుత్ర అనే అధికారి తెలిపారు.

https://twitter.com/isudhans/status/1292776384943669248?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1292776384943669248%7Ctwgr%5E&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Fworld-news%2Findonesias-mount-sinabung-erupts-sends-smoke-ash-5-000-metres-into-the-air-2277257

Indonesia Sinabung Volcano eruption in Sumatra Island

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News