Home తాజా వార్తలు అభివృద్దిపథంలో దూసుకెళ్తున్న.. ’నిర్మల్ ’

అభివృద్దిపథంలో దూసుకెళ్తున్న.. ’నిర్మల్ ’

Venkateswara Swamy Temple

 

నిర్మల్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు నూతన జిల్లాగా ఆవిర్భవించిన నిర్మల్ జిల్లా అభివృద్దిపథంలో దూసుకెళ్తుందని రాష్ట్ర పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్ మండలంలోని అనతంపేట్ గ్రామంలో నిర్మించే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి భూమి పూజ చేశారు. ఆలయాభివృద్దికి రూ.38 లక్షలను విడుదల చేసినట్లు తెలిపారు. అనంతరం పరిసరా ప్రాంతాలల్లో మొక్కలు నాటారు. ఈ సందర్బంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. అన్ని రంగాలల్లో నిర్మల్ జిల్లా అభివృద్దిపథంలో సాగుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజల కోసం టిఆర్‌ఎస్ ప్రభుత్వం, సిఎం కెసిఆర్ నిరంతరంగా కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో చిన్న, పెద్ద దేవాలయాలకు నిధులు మంజూరు చేయించి అభివృద్ది దిశగా సాగిస్తున్నారన్నారు.

ఈ సందర్బంగా నిర్మల్ జిల్లాలోని ప్రధాన ఆలయాలతో పాటు చిన్న చిన్న ఆలయాలకు సైతం నిధులు మంజూరు చేయించి అభివృద్ది చేయిస్తున్నామన్నారు. అలాగే హరితహారంలో భాగంగా ప్రతీ ఒక్కరు మొక్కలు సంరక్షించాలన్నారు. అనంతరం నిలాయిపేట్ గ్రామంలో హరితహారంలో భాగంగా గ్రామస్తులతో కలిసి 1500 మొక్కలు నాటారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతీ పల్లె పచ్చదనంతో కళకళలాడాలని సిఎం ఆలోచన మేరకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. మొక్కలు నాటి అవి పెరిగే వరకు సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమాలలో జెడ్పిచైర్మన్ కోరిపెల్లి విజయలక్ష్మిరెడ్డి, ఎస్పీ శశిధర్‌రాజు, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్‌రెడ్డి, రాజేందర్, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, ఆశోక్, విలాస్, నాయకులు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Indrakaran bhoomi pooja to Venkateswara Swamy Temple