Friday, July 11, 2025

ఇంద్రావతి నేషనల్ పార్క్ లో ఎదురుకాల్పులు: మావోయిస్టు మృతి

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక మావో మృతి చెందాడు. ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని సమాచారం రావడంతో డిఆర్‌జి, ఎస్‌టిఎఫ్ బలగాలు సంయుక్తంగా మావోల కోసం ఆపరేషన్ చేపట్టాయి. భద్రతా బలగాల అలజడితో మావోలు కాల్పులు జరిపారు. భద్రతా ఎదురుకాల్పులు జరపడంతో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఘటనా స్థలం నుంచి భారీగా మందుగుండు సామాగ్రి, ఎకె 47 రైఫిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News