Friday, April 19, 2024

పారిశ్రామిక విజయ తెలం’గానం’

- Advertisement -
- Advertisement -

Industrial success Telangana Says Minister KTR

టిఎస్ ఐపాస్‌తో అసాధారణ విజయాలు

పరిశ్రమల ఏర్పాటుకు సులభంగా అనుమతులు ఏడేళ్లుగా తెలంగాణ ముందంజ
కెసిఆర్ సమర్థ సుస్థిర పాలనలో సమగ్రాభివృద్ధి ఆయన ఏ కార్యక్రమం తీసుకున్నా
100% విజయవంతం చేస్తారు అదే ఆయన ప్రత్యేక శైలి రంగారెడ్డి జిల్లా మేకగూడలో
పోకర్ణ ఇంజినీర్డ్ స్టోన్ లిమిటెడ్ రెండో యూనిట్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: పారిశ్రామిక రంగానికి తెలంగాణ రాష్ట్రం స్వర్గధామంగా కొనసాగుతోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మం త్రి కెటిఆర్ అన్నారు. ఈ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పలు విప్లవాత్మక నిర్ణయాలు, చేపట్టిన విధానాలు పారిశ్రామిక రంగానికి వరంగా మారాయన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు పెద్దఎత్తున ముందుకు వస్తున్నారన్నారు. కంపెనీల ఏర్పాటుకు అవసరమైన సహాయ, స హకారాలను రాష్ట్ర ప్రభుత్వం సైతం స ంపూర్ణంగా అందిస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం టిఎస్…ఐపాస్ విధానం తీసుకొచ్చిందన్నారు. దీని ద్వారా పరిశ్రమల ఏర్పాటు కు సులభంగా అనుమతులు ఇస్తున్నామన్నారు. దీంతో పారిశ్రామిక రంగంలో ఏ డేళ్లుగా తెలంగాణ దేశంలో ముందుందని ఆయన వెల్లడించారు.

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని మేకగూడలో పోకర్ణ ఇంజినీర్డ్ స్టోన్ లిమిటెడ్ క్వాట్రా క్వార్ట్ రెండవ యూనిట్‌ను శనివారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో కలిసి మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ, పారిశ్రామిక రంగంలో రాష్ట్రం ఎంతో శరవేగంగా ముందుకు దూసుకుపోతున్నదన్నారు. వి దేశీ సంస్థలను ఆకర్షించడంతో పాటు కొ త్త పరిశ్రమల ఏర్పాటు సరళీకృతం చేస్తూ టిఎస్..ఐపాస్ లాంటి విప్లవాత్మక సంస్కరణలు ఎన్నో చేపట్టామన్నారు. ఈ విధానంలో కేవలం 15 రోజుల్లోనే పరిశ్రమలకు కావాల్సిన అన్ని రకాల అనుమతు లు ఇస్తున్నామన్నారు. పదిహేను రోజుల్లో అనుమతి రానిపక్షంలో డీమ్డ్ అప్రూవ్డ్‌గా భావించాల్సి ఉంటుందన్నారు. పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడమే కాకుండా వాటికి నిరంతరాయంగా నాణ్యమైన కరె ంటు, నీళ్లు కూడా అందిస్తున్నామని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. టిఎస్…ఐపాస్ ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రంలో 15 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగిందని మంత్రి అన్నారు. కాగా పెట్టుబడుల రూపంలో మొత్తంగా రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి వచ్చాయన్నారు.

సమర్థవంతమైన నాయకత్వం, సుస్థిర ప్రభుత్వం

రాష్ట్రంలో సమర్థంతమైన, సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోందని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఈ రెండు ఉన్నప్పుడే రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సిఎం కెసిఆర్ ఆకారంలో బక్కగా కనిపించినప్పటికీ…ఆయనది అత్యంత బలమైన ధృడ సంకల్పమన్నారు. అందుకే ఆయన ఎటువంటి కార్యక్రమం తీసుకున్నా…దానిని నూటికి నూరు శాతం విజయవంతం చేస్తారన్నారు. అదే సిఎం కెసిఆర్ ప్రత్యేక శైలి అని మంత్రి కెటిఆర్ అన్నారు. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతునారని మంత్రి కెటిఆర్ తెలిపారు. కాగా కంపెనీలో స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా సంస్థ యాజమాన్యాన్ని మంత్రి కెటిఆర్ కోరారు. ఈ ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 3 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఈ కంపెనీకి అన్ని విధాలా తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ నియోజవర్గం పార్లమెంట్ సభ్యుడు మన్నే శ్రీనివాస్ రెడ్డి,పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి జయేష్ రంజన్ ,శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News