Home తాజా వార్తలు పీకల్లోతు కష్టాల్లో బంగ్లా… రెండో టెస్టు 33/4

పీకల్లోతు కష్టాల్లో బంగ్లా… రెండో టెస్టు 33/4

 

కోల్‌కతా: భారత-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు బంగ్లా నాలుగు వికెట్లు కోల్పోయి 33 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రధానమైన నాలుగు వికెట్ల కోల్పోవడంతో బంగ్లా పీకల్లోతు కష్టాల్లో పడింది. మోమినల్ హక్, మహ్మద్ మిథున్, ముస్ఫికర్ రహీమ్ పరుగులేమి చేయకుండా డకౌట్ రూపంలో ఔటయ్యారు. ఓపెనర్ షాద్‌మాన్ 28 పరుగులతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టగా ఇషాంత్ శర్మ, మహ్మాద్ షమీ చెరో ఒక వికెట్ తీశారు. తొలి టెస్టులో బంగ్లాపై భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

 

IndvBDESH: Bangla Loss 4 Wicket 33 Runs in 2nd Test, Three Main Batsmens Dockout in First Innings from Bangladesh, Umesh Yadav take Two wickets,

 

IndvBDESH: Bangla Loss 4 Wicket 33 Runs in 2nd Test