Home మన ఆరోగ్యం ఫిజికల్ ఫిట్‌నెస్‌తో ఇన్ఫెక్షన్స్ దూరం

ఫిజికల్ ఫిట్‌నెస్‌తో ఇన్ఫెక్షన్స్ దూరం

వర్షాకాలంలో ఎక్కువగా ఇబ్బందిపడేది చిన్నపిల్లలే. చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవ సరం ఉండదు. ఒకవేళ రోగాన పడితే ముందుగానే గుర్తించి సరైన వైద్యం అందిస్తే సరిపోతుంది. ఈ సీజన్‌లో వచ్చే వ్యాధుల, వాటి నివారణ గురించి డాక్టర్ సుగుణాకర్‌రెడ్డి, పల్స్‌కి వివరించారు.

OF

* ఈ సీజన్‌లో పిల్లలకు వచ్చే వ్యాధులు ఏమిటి?
  జాగ్ర త్తలు ఏమి తీసుకోవాలి?
వర్షాకాలంలో పిల్లలకి ఎక్కువగా వచ్చేవి అప్పర్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్స్. వై రల్ ఇన్‌ఫెక్షన్స్ వస్తాయి. జ్వరము, జలుబు, దగ్గు ఎక్కువగా వస్తుంటాయి. ఇవి వచ్చినప్పుడు అశ్రద్ధ చేస్తే వైరల్ నుండి బ్యాక్టీరియాకి దారితీస్తుంది. ఇలాంటివి వచ్చినప్పుడు పిల్లల్ని బయట ఎక్కువగా తిరగనీయకుండా చూసుకోవాలి. ఆ సమయంలో స్కూల్ కి పం పకుండా ఉండటమే మంచిది. పాఠశాల ల్లో అయితే పిల్లల్లో ఒకరికి వస్తే త్వ రగా ఇంకొకరికి వచ్చేస్తాయి. ఇంట్లోకూడా ఇతర పిల్లలకి దూరంగా ఉంచాలి. అప్పుడు మిగతా పిల్లలకు రాకుండా ఉంటుంది. వర్షంలో, చల్లగాలి తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.
* ఆస్తమా ఉన్న పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఆస్తమా ఉన్న పిల్లలకి చిన్నచిన్న ఇన్‌ఫెక్షన్సే అవుతాయి. మొదట ఆస్తమా వస్తుంది. అది ఎక్కువైతో నిమోనియా వస్తుంది. ఇటువంటి పిల్లలకి ఈ సీజన్ మొదలుకాక ముందే ఇన్‌ఫ్లుయంజా వాక్సిన్ వేయించాలి. ఆ వ్యాక్సిన్ వల్ల ఆస్తమా ప్రభావం కొద్దిగా తక్కువగా ఉంటుంది.
* వీరికి ఎలాంటి ఆహారం ఏమి ఇవ్వాలి?
వీరికి త్వరగా జీర్ణమయ్యే ఆహారం పెట్టాలి. నూనెపదార్థాలు, మాంసాహారం పెట్టకూడదు. ఫ్రిజ్‌లో దాచిన తినుబండారాలు పెట్టకూడదు. పుల్లటి పండ్లు, చాక్‌లెట్స్ తినకుండా ఉంటే మంచిది. నారింజ, బత్తాయి, కమల, దా నిమ్మ, గ్రేప్స్, పైనాపిల్, నిమ్మ లాంటివి పెట్టకూడదు. ఐస్‌క్రీమ్, చల్లటి పానీయాలు ఇవ్వకూడదు. వర్షాకాలంలో ఎక్కువగా వైరల్ ఇన్‌ఫెక్షన్స్ వస్తాయి. వర్షాలు పడి దో మలు పెరుగుతాయి. దాంతో మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా లాంటి వ్యాధులు వస్తాయి. హైదరాబాద్‌లో ఎక్కువగా మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా, ఎక్కువగా వస్తున్నాయి. ఇంకా ఈ కాలంలో మెదడు వాపు వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. వర్షం పడినప్పుడు, తడి వాతావరణం ఉన్నప్పుడు పిల్లలని బయటకు వెళ్లనివ్వకుండా ఉండటమే మంచిది. వర్షంలోతడిసినా వెంటనే పొడ్డి బట్టలు వేయాలి.
* పిల్లల్లో ఒబేసిటీ రాకుండా జాగ్రత్తలు ఏమి చేయాలి?
ఇప్పుడు పిల్లల్లో వ్యాయామం లేకపోవటం వల్ల ఊబకాయం వస్తోంది. వీరికి ఆహారం కంటే ముందుగా వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆడుకునే సమయం ఉండటం లేదు. పాఠశాలల్లో ప్లే గ్రౌండ్ ఉండటం లేదు. క్లాస్‌రూమ్స్‌లోనే ఆటవస్తువులు ఉంటున్నాయి. పొద్దుటే ఏడు గంటలకి వెళుతున్నారు. మధ్యలో రెండు, మూడు టిఫిన్ బాక్సులు పె డుతున్నారు. మళ్లీ వచ్చాక టిఫిన్ పెడతారు. ఇంట్లో కూర్చుని టివిలు చూ డటం, సెల్‌ఫోన్స్‌తో ఆడటంతో పిల్లలకి ఎక్సర్‌సైజు అనేది ఉండటం లేదు. వాళ్ళకి తప్పనిసరిగా ఒక గంట ఫిజికల్ ఎక్సర్‌సైజ్ ఉండాలి. పాఠశాలలు దూరంగా ఉండటం, బస్సు రాదని త్వరగా వెళ్లిపోతుంటారు. ప్రాథమిక పాఠశాలలకి మాత్రం స్కూల్స్ సమయాన్ని తగ్గించాలి. పిల్లలకి స్కూలు ఇంటి కి దగ్గరలో ఉంటే మంచిది. అప్పుడే వాళ్లకి ఆడుకోవటానికి సమయం ఉం టుంది. ఈ కాలంలో 30శాతం మంది పిల్లలకి ఒబేసిటీ వస్తోంది. 7-10 సంవత్సరాలు వచ్చిన తరువాత పిల్లలు ఒక్కసారిగా పెరుగుతున్నారు. వీరు ఎక్కువగా బయటి ఫుడ్ తినటం వల్ల పెరుగుతున్నారు. పిల్లలకి ఫిజికల్ ఫిట్‌నెస్‌కి తల్లిదండ్రులు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి.
* సైనసైటిస్ వచ్చిన పిల్లలకి ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి?
సైనసైటిస్‌కి రావడానికి వైరల్ ఇన్‌ఫెక్షన్స్ మూలం. వీటిమూలంగా కొంతమందికి సైనసైటిస్, కొంతమందికి ఆస్తమా, కొంతమందికి నిమోనియా వస్తుంది. కొంతమందికి చెవిపోటు వస్తుంది. జలుబునుంచి చెవిపోటు వస్తుంది. మామూలు జ్వరం, కోల్డ్ కు డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కరలేదు. ఫీవర్ మెడిసిన్, కోల్డ్ మెడిసిన్ వేసుకుంటే సరిపోతుంది.కానీ యాంటీబయాటిక్ వాడకూడదు. మూడు రోజుల్లో ఇవి తగ్గకపోతే అప్పుడు యాంటీబయాటిక్స్ వాడాలి . పిల్లలకి జ్వరం వస్తే సాధారణంగా ద్రవాహారం ఎక్కువగా ఇవ్వాలి. ఒఆర్‌ఎస్ లిక్విడ్ లాంటివి ఎక్కువగా ఇవ్వాలి. ఇంట్లో చేసిన గంజి లాంటివి అయితే మంచిది. కొబ్బరినీళ్ళు పట్టించవచ్చు.పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు వాళ్ళకి పూర్తి విశ్రాం తి ఉండాలి. ఆటలకి పంపకూడదు. స్కూలుకు పంపకూడదు. జ్వరం మెడిసిన్ వేస్తూ విశ్రాంతి ఇవ్వాలి. బయటికి వెళ్లి ఆడుకుంటే మళ్లీ తిరిగి వస్తుంది. ఆటలకి పంపకూడదు.
* వర్షాకాలంలో పిల్లల చర్మ సంరక్షణ ఎలా?
వర్షాకాలంలో పిల్లలు పాఠశాల నుండి వచ్చేటప్పుడు షూస్, సాక్స్‌లు తడిస్తే వెంటనే మార్చాలి. పాదాల వేళ్లమధ్యలో ఫంగస్ ఇన్‌ఫెక్షన్స్ వస్తాయి. బురద నీళ్లలో ఆడకుండా చూసుకోవాలి. రైనీ సీజన్‌లో బట్టలు, షూస్ పొడిగా ఉంచాలి.
* తాగు నీరు శుభ్రంగా ఉండాలి?
పాఠశాలల్లో స్వచ్ఛమైన తాగు నీరు ఉండాలి. పిల్లలు తీసికెళ్లిన బాటిల్ నీరు సరిపోక పోతే స్కూల్లో నీటిని తాగుతారు. ఆ నీరు శుభ్రంగా లేకపోతే వాంతులు, మోషన్స్ వస్తాయి. పిల్లలు లంచ్ రూమ్స్ శుభ్రంగా ఉండాలి. ఈగలు రాకుండా చూసుకోవాలి. ఈగలు వస్తే లోపల ఫుడ్ మీద పడి కలరా, టైఫాయిడ్, వాంతులు, విరేచనాలు ఈ సీజన్‌లో ఎక్కువగా వస్తాయి. లంచ్ రూమ్ వాతావరణం పరిశుభ్రంగా ఉంచాలి.

  లలిత