Home ఆఫ్ బీట్ తల్లికి పిల్ల బరువా..?!

తల్లికి పిల్ల బరువా..?!

Elephant-Baby

గర్భం తొమ్మిది నెలలు మోస్తేనే మనుషుల్లో మాతృత్వం సాధ్యమవుతుంది. సాధారణంగా ఈ గర్భధారణ సమయమే చాలా ఎక్కువ అనుకుంటాం మనం, అయితే  మనిషికంటే ఎక్కువ రోజులు గర్భాన్ని మోసే జంతువులు కూడా ఉన్నాయి. ఆ జంతువులు ఏంటి, వాటి గర్భధారణ సమయం ఎంత అనే వివరాలివిగో… 

ఒంటె: మొరటుగా కనిపించే ఒంటెలు పిల్లల్ని కనే విషయంలో చాలా ఓర్పుగా వ్యవహరిస్తాయి. దాదాపు 13-14 నెలలు అంటే 410 రోజులు ఇవి గర్భాన్ని మోస్తాయి.
జిరాఫీ: వీటి గర్భధారణ సమయం 400-460 రోజులు. పిల్లలను కనడానికి సరైన సమయం, ప్రదేశం చూసుకుంటుంది జిరాఫీ . అడవిలోని క్రూర మృగాల బారిన పడకూడదని కడుపులో పిండాన్ని ఎక్కువ రోజులు మోస్తుంది. ఎత్తుగా ఉండే ఇవి నిల్చోనే పిల్లలకు జన్మనిస్తుంది, గర్భ సంచి పగిలిపోయి పిల్ల జిరాఫీ బయటకు వస్తుంది. అందికే వాటి పిల్లలు గర్భంలోనే ఎన్నో విషయాలు నేర్చుకునేలా వీటి గర్భధారణ సమయం ఆధారపడి ఉంటుంది.
వెల్వెట్ పురుగు:పరిమాణంలో పెద్దగా ఉండే క్షీరదాలే కాకుండా, చిన్న పురుగుల గర్భధారణ సమయం కూడా ఎక్కువ రోజులు ఉంటుంది, వాటిల్లో ఒకటి వెల్వెట్ వార్మ్. చూడగానే అసహ్యంగా కనిపించే ఈ పురుగు దాని పిల్లని కడుపులో 15 నెలలు మోస్తుంది.
రైనోసార్లు: అతి పెద్దగా ఉండే రైనోల గర్భధారణ సమయం 450 రోజులు. అతిపోడవైన గర్భధారణ సమయమే వీటి సంఖ్య పెరగకపోవడానికి కారణం. ప్రస్తుతమున్న ఐదు రకాలైన రైనోసార్ల మనుగడ ఇప్పటికే ప్రశ్నార్థకం అయ్యింది. ఐదింట్లో మూడు రైనోసార్ల జీవనం ప్రమాదపుటంచుల్లో ఉంది.
సీ వేల్స్, డాల్ఫిన్స్: సమూహ జీవనం, ప్రశాంతమైన గుణం కలిగిన వేల్స్, డాల్ఫిన్స్ అత్యంత తెలివిగల జీవులు. ఇవి వీటి పిల్లల పెంపకంలో కూడా చాలా శ్రద్ధ కనబరుస్తాయి. వీటి గర్భధారణ సమయం 17 నెలలు, వీటిల్లో కొన్ని రకాలు 19 నెలలు కూడా పిల్లల్ని కడుపులో కాచుకుంటాయి.
ఏనుగు: భూమ్మీద ఉన్న క్షీరదాలన్నింటిలో ఏనుగుల గర్భధారణ సమయం పెద్దది. పిల్ల ఏనుగుకు జన్మనిచ్చేందుకు రెండు సంవత్సరాలు కడుపులో కాపాడుకుంటాయి తల్లి ఏనుగులు. సాధారణంగా మేధస్సు ఎక్కువగా ఉండే జంతువుల్లో గర్భధారణ వయసు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఏనుగులు ఆకారంలోనే కాకుండా మేధస్సులోనూ మేటి.
షార్క్ చేపలు: స్పైనీ డాగ్‌ఫిష్ షార్క్ తన పిల్లను రెండేండ్లు కడుపులో దాచుకుంటుంది. బాస్కింగ్ షార్క్‌లు పిల్లల్ని మూడేండ్లు గర్భంలో దాచుకుంటాయి. మరో రకమైన ఫ్రిల్ల్‌డ్ షార్క్ మూడున్నర సంవత్సరాలు పిల్లల్ని కడుపులో మోస్తాయి.