Home తాజా వార్తలు ఇన్ఫోసిస్ లాభం రూ.5,421 కోట్లు

ఇన్ఫోసిస్ లాభం రూ.5,421 కోట్లు

Infosys Q2 profit up 11.9% to Rs 5421 cr

 

గతేడాదితో పోలిస్తే 12 శాతం జంప్

న్యూఢిల్లీ : సెప్టెంబర్ ముగింపు నాటి త్రైమాసిక ఫలితాల్లో దేశీయ ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ నికర లాభం రూ.5,421 కోట్లతో 12 శాతం వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ లాభం రూ.4,845 కోట్లు ఉంది. సంస్థ ఆదాయం 20 శాతం వృద్ధిని సాధించింది. ఈ ఆదాయం రూ.24,570 కోట్ల నుంచి రూ.29,602 కోట్లకు పెరిగింది. అయితే కంపెనీ నికర లాభం జూన్ త్రైమాసికంలో వచ్చిన రూ.5,195 కోట్లతో పోలిస్తే ఈసారి స్వల్పంగా 4.4 శాతమే పెరిగింది. డైమ్లర్ ఒప్పందం, క్లయింట్ల నుంచి అధికంగా డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అడాప్షన్, విస్తృత స్థాయిలో వృద్ధి నుంచి సంస్థకు ఎక్కవగా ఆదాయం వచ్చింది. 202122 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రెవెన్యూ గైడెన్స్‌ను 16.517.5 శాతానికి సవరించింది. అయితే మార్జిన్ గైడెన్స్‌ను 2224 శాతాన్నే కొనసాగించింది. ఫలితాల నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేరు విలువ 1.18 శాతం పెరిగి రూ.1,705కు చేరింది. కంపెనీ బోర్డు షేరుకు రూ.15 చొప్పున డివిడెండ్‌ను ప్రకటించింది. కంపెనీ సిఇఒ సలిల్ పరేఖ్ మాట్లాడుతూ, అద్భుతమైన పనితీరు, వేగవంతమైన వృద్ధిపై దృష్టి పెట్టామని, సంస్థ డిజిటల్ ఆఫరింగ్స్ బలోపేతమయ్యాయని అన్నారు.

Infosys Q2 profit up 11.9% to Rs 5421 cr