Home తాజా వార్తలు దేవుడు కూడా ఇన్ఫోసిస్ సంఖ్యలను మార్చలేడు

దేవుడు కూడా ఇన్ఫోసిస్ సంఖ్యలను మార్చలేడు

Nandan-Nilekani
ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని

న్యూఢిల్లీ: విజిల్‌బ్లోయర్ ఆరోపణలను ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ బుధవారం ఖండించింది. ఇది ఇమేజ్‌ను పూర్తిగా దెబ్బతీసే ప్రయత్నమని, ఆరోపణలను ఖండిస్తున్నామని కంపెనీ చైర్మన్ నందన్ నీలేకని స్టాక్ మార్కెట్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘నా సహ వ్యవస్థాపకులతో పాటు నా జీవితమంతా కంపెనీకి ఇచ్చాం. ఈ సంస్థ కోసం పాటుపడుతున్నారు. ఇది ఇప్పటికీ నిస్వార్థంగా పనిచేస్తోంది. దేవుడు కూడా ఇన్ఫోసిస్ సంఖ్యల ను మార్చలేడు’ అని ఆయన అన్నారు. పుకార్లతో సంస్థ ను అప్రతిష్టపాలు చేసేందుకు కట్ర జరుగుతోందని నీలేకని లేఖలో రాశారు. సహ వ్యవస్థాపకులు ఇప్పటికీ ఇన్ఫోసిస్ దీర్ఘకాలిక విజయానికి కట్టుబడి ఉన్నారని, గుర్తతెలియని వ్యక్తులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై దర్యాప్తు నివేదిక తగిన సమయంలో వెల్లడిస్తామని అన్నారు.

సంస్థ ఉన్నత స్థాయి కార్పొరేట్ పాల న ప్రమాణానికి కట్టుబడి ఉందని, గత 15 సంవత్సరాలుగా విజిల్‌బ్లోయర్ విధానాన్ని అనుసరిస్తున్నాం, నిజాయితీ, పారదర్శకత సంస్థ వ్యాపారంలో చాలా ప్రధానమైందని అన్నారు. ఇన్ఫోసిస్ విజిల్‌బ్లోయర్ కేసును నిరాధారమైనదిగా పేర్కొంది. ఫిర్యాదుపై దర్యాప్తు చేసేటప్పుడు ఎలాంటి ఆధారాలు కనుగొనలేదని వెల్లడించింది. నవంబర్ 2 న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు రాసిన లేఖలో దర్యాప్తులో ఎటువంటి వాస్తవాలు లేదా ఆధారాలు వెలుగులోకి రాలేదని తెలిపింది.

భారత్ ద్రవ్య లోటు 3.6 శాతం

రేటింగ్ సంస్థ ఫిచ్ అంచనా
న్యూఢిల్లీ: ఫిచ్ సొల్యూషన్స్ బుధవారం భారత ఆర్థి క లోటు అంచనా ను ఈ ఆర్థిక సంవత్సరం (2019 20)లో 3.4 శాతం నుండి 3.6 శాతానికి పెంచింది. ఆర్థిక వృద్ధి మందగించడం, ప్రభుత్వ కార్పొరేట్ పన్ను కోత కారణంగా ఆదాయ సేకరణ తగ్గ డం దీనికి కారణమని పేర్కొంది. జిఎస్‌టి (వస్తు, సేవల పన్ను), కార్పొరేట్ ఆదాయపు పన్ను వసూళ్లలో బలహీనత ఉన్నందున 2019-20 సాధారణ బడ్జెట్ లక్ష్యం కంటే ఆదాయ సేకరణ వసూలు చేయడం వల్ల ద్రవ్య లోటు అంచనాలను సవరించామని ఫిచ్ తెలిపింది. కంపెనీ పన్నును 30 శాతం నుంచి 20శాతానికి తగ్గిస్తున్నట్లు సెప్టెంబర్ 20న ప్రభుత్వం ప్రకటించింది.

Infosys Whistleblower Complaint