Home తాజా వార్తలు ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక వసతులు : ఈటల

ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక వసతులు : ఈటల

Etela Rajenderహైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక వసతులు కలిపించామని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్  తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వాస్పత్రులపై ప్రజలకు నమ్మం పెరిగిందని, ఈ క్రమంలో ప్రభుత్వాస్పత్రుల్లోనే ఎక్కువ మంది ప్రజలు వైద్యం చేయించుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలడంతో ప్రభుత్వాస్పత్రుల వైద్యులు, సిబ్బంది సెలవులను రద్దు చేశామని ఆయన పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో ఈటల రాజేందర్ మాట్లాడారు. సీజనల్ వ్యాధుల నివారణకు తాము చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదని ఆయన హితవు పలికారు. గ్రామీణాభివృద్ధి కోసం 30 రోజుల ప్రణాళికను తయారు చేశామని ఆయన తెలిపారు. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో 25 కౌంటర్లను ఏర్పాటు చేశామని, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో వైద్యుల సెలవులు రద్దు చేసినట్టు ఆయన వెల్లడించారు. వైద్యులు రోజుకు 24 గంటలు పని చేస్తారని ఆయన చెప్పారు.అంగన్ వాడీ కేంద్రాల్లో గర్భిణులకు పోషకాహారం అందిస్తున్నామని, అన్ని హాస్టళ్లలో సన్న బియ్యంతో భోజనం పెడుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య తెలంగాణ కోసం కెసిఆర్ నేతృత్వంలో అనేక పథకాలు అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయకుండా విపక్షాలు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు.

Infrastructure In Government Hospitals : Etela Rajender