వనపర్తి జిల్లా వీపనగండ్లలో దారుణం
మన తెలంగాణ/వనపర్తి : పాత కక్షలు, భూ తగాదాల కారణంగా లోక్‌నాథ్(2) అనే చిన్నారిపై దాడి చేసి, మలమూత్ర ద్వారాల గుండా సిరంజి సూదులను శరీరంలోకి గుచ్చిన ఘటన వనపర్తి జిల్లా వీపనగండ్ల మండ ల కేంద్రంలో జరిగింది. వీపనగండ్లకు చెందిన అశోక్, అన్నపూర్ణ దంపతులకు ఇద్దరు కూతుళ్ల తర్వాత ఒక్క కుమారుడు లోక్‌నాథ్ పుట్టాడు. లోక్‌నాథ్ ఇటీవల తరుచుగా కడుపునొప్పితో ఏడుస్తుండడంతో తల్లిదండ్రులకు అనుమానం కలిగి పెబ్బేరు మండల కేంద్రంలో ని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. వై ద్యుల పరీక్షలో లోక్‌నాథ్ మలద్వారం వద్ద ఒక సూది బయటపడింది. మరుసటి రోజు బాలుడి తల్లి అన్నపూర్ణకు మూత్ర ద్వారం వద్ద మరో సూది కనిపించింది. సూది మింగి ఉంటాడని అది మల మూత్ర ద్వారం గుండా బయటికి వచ్చి ఉంటుందని భావించారు. అయితే బాలుడు ఏడుపు ఆపకపోవడంతో గత 15 రోజుల క్రితం వనపర్తి ఏరియా ఆసుపత్రిలో ఎక్స్ రే తీయించారు.
లోక్‌నాథ్ కడుపులో 10 సూదులు ఉన్నట్టు తేలింది. దీంతో లోక్‌నాథ్‌ను హైద్రాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే వైద్యుల సూచనల మేరకు ఆ మరుసటి రోజు ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా వైద్యులు పట్టించుకోకపోవడంతో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని సుధా నర్సింగ్‌హోం వైద్యుడు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డిని సంప్రదించారు. వెంటనే స్పందించిన శ్రీనివాస్‌రెడ్డి లోక్‌నాథ్‌కు ఆపరేషన్ చేసి 8 సూదులను శరీరంలో నుంచి బయటికి తీశారు. మరో రెండు సూదులు మల ద్వార ంలో ఉన్నాయని, వాటి వల్ల ఎలాంటి ఇబ్బ ంది లేదని డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తన చిన్నత్త అలివేలుపై అనుమానం ఉందని లోక్‌నాథ్ తల్లి అన్నపూర్ణ తెలిపారు. తమ కుటుంబాల మధ్య భూతగాదాలు ఉన్నాయని, తన చిన్నత్తే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటుందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అలివేలుతో పాటు మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.