Home అంతర్జాతీయ వార్తలు ప్రశ్నించే సంస్థల గొంతు నులిమే చట్టం అన్యాయం

ప్రశ్నించే సంస్థల గొంతు నులిమే చట్టం అన్యాయం

భారతదేశంపై  ఐరాస హక్కుల సంఘం నిరసన

UNOవాషింగ్టన్ : భారతదేశంలో స్వచ్చంద సేవా సంస్థ లకు (ఎన్‌జిఒ) విదేశీ నిధుల నియంత్రణ చట్టం అనుచితం అని, దీనిని రద్దు చేయాలని ఐక్యరాజ్య సమితికి చెందిన మానవ హక్కుల సంఘం పేర్కొంది. ప్రభుత్వ పథకాలలోని లోపాలను ఎత్తిచూపే సంస్థలను బలహీన పర్చేందుకు ఈ చట్టంలోని నిబంధనలు కటుతరంగా ఉన్నాయని, ఎన్‌జి ఒలకు విదేశీ నిధుల వనరులపై ఆంక్ష లు విధించే విదేశీ సహాయ నియంత్రణ చట్టం (ఎఫ్‌సి ఆర్‌ఎ) నిబంధనలతో జరుగుతున్న అనర్థాల గురించి మానవ హక్కుల సంఘా నికి ఫిర్యాదులు అందాయని, దీనిపై సమీక్ష నిర్వహిం చారని ఐరాస హక్కుల సంఘం ప్రతినిధులు తెలిపారు. మానవ హక్కుల పరిరక్షకులు మైకెల్ ఫార్‌స్ట్, భావ వ్యక్తీకరణకు సంబంధించి డేవిడ్ కాయ్, సంస్థల స్వేచ్ఛకు సంబంధించి మైనా కియాయ్ హక్కుల సంఘం వద్ద తమ వాదనలను విన్పించారు. భారతదేశంలో తీసుకువచ్చిన చట్టంలోని నిబందనలను ప్రభుత్వం తమ విధానాలను ప్రతిఘటించే వారిని దెబ్బ తీసేందుకు వినియోగించుకొం టోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పౌర, రాజకీయ, ఆర్థిక, సామాజిక, పర్యావరణ లేదా సాంస్కృ తిక ప్రాధాన్యతలతో ఉన్న సం స్థల కార్యకలాపాలకు ఈ చట్టం నిబంధనలు ఇబ్బంది కరంగా మారుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ అనుకూల వర్గాలతో విభేదించేవారిపై ఆంక్షలకు దిగడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. హక్కులకు సంబంధించిన మూడు కీలక అంశాలలో నిపు ణులైన ఈ ముగ్గురూ ఇప్పటికైనా భారతదేశం వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని పిలుపు నిచ్చారు. విదేశీ నిధులపై ఆంక్షల నిబంధనలు అంతర్జా తీయ హక్కుల ప్రమాణా లకు, నిబంధనలకు ప్రతిఘా తంగా ఉన్నాయనే విషయా న్ని గుర్తుంచుకోవాలని వీరు కోరారు. విదేశీ నిధులు అందుకుంటున్న సంస్థలు ఇతర కార్యక్రమాలకు వీటిని వాడుకుంటున్నాయనే ఆరోపణలలో నిజంలేదని పూర్తి స్థాయిలో హక్కుల గురించి పోరాడే లాయర్స్ కలెక్టివ్ సంస్థ సాక్షాలతో పాటు చూపినప్పటికీ ఆంక్షలు సాగించడం అనుచితం అని పేర్కొన్నారు. హక్కు ల సంఘం నిపుణుల ప్రకటన ఐరాస హక్కుల హైకమి షనర్ కార్యాలయం తరఫున వెలువడింది. రాజకీయ దురు ద్ధేంతోనే నిధులను నిలిపివేస్తున్నారనే అంశాలు తమకు ఆందోళన కల్గిస్తున్నా యని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో బెదిరింపులు, వాటి చట్టబద్ధతకు ఇబ్బంది కల్పించడం వంటి చర్యలు అను చితం అని పేర్కొన్నారు. వారి తరఫున వాదించే లాయర్లకు ఇబ్బందులు కల్పించడం వంటి అంశాలు తమ దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలలోని తప్పొప్పులను తగు విధంగా ప్రస్తావించడం తప్పేలా అవుతుందని నిపుణులు ప్రశ్నిం చారు. భారతీయ సమాజంలోని బలహీన వర్గాలకు, అణచి వేతకు గురవుతున్న వారికి అనుకూలంగా స్వచ్చంద సంస్థ లు ప్రజావ్యాజ్యాలకు దిగుతున్నాయని, తమ వాదన విన్పి స్తున్నాయని, ఈ మేరకు ఎన్‌జిఒలకు తగు గుర్తింపు ఉంద ని తెలిపారు. ఎఫ్‌సిఆర్‌ఎ పరిధిలో భారత హోం మంత్రి త్వశాఖ ఆరు నెలల పాటు లాయర్స్ కనెక్టివ్‌తో పాటు కొ న్ని సంస్థల గుర్తింపును తాత్కాలికంగా నిలిపివేసిన విష యాన్ని హక్కుల సంఘం ప్రస్తావించింది. లాయర్స్ కనెక్టివ్ సంస్థ వ్యవస్థాపకులు మానవ హక్కుల న్యాయవాది ఇందిరా జైసింగ్, ఆనంద్‌గ్రోవర్‌లు తమ సంస్థలకు అందే విదేశీ నిధులను వేరే కార్యక్రమాలకు మళ్లిస్తున్నారనే ఆరోప ణలపై సంస్థ గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేశారు. కొత్త చట్టం పరిధిలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఈ చర్య తీసుకుంది. అదే విధంగా హోం మంత్రిత్వశాఖ సబ్‌రంగ్ ట్రస్టు శాశ్వత రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. ఈ సంస్థను పౌర హక్కుల ఉద్యమకర్త తీస్తా సేతల్‌వాద్, ఆమె భర్త జావెద్ ఆనంద్ నిర్వహిస్తున్నారు. ఈ సంస్థపై చర్య తక్ష ణం అమలులోకి వస్తుందని ప్రకటించారు.
అదే విధంగా ప్రభుత్వం గ్రీన్‌పీస్ ఇండియా గుర్తింపును కూడా సస్పెండ్ చేసింది. ఇవన్నీ కూడా హక్కుల ఉల్లంఘనకు వస్తాయని నిపుణులు పేర్కొన్నారు. విదేశీ నిధుల సమీక రణపై ఆంక్షలు తీవ్రతరం కాకుండా ఉంటేనే సంబం ధిత సంస్థలు తమ కీలక విధు లను, హక్కుల పట్ల బాధ్యత లను సరైన విధంగా నిర్వర్తించ గల్గు తాయని, ఇలాంటి సంస్థ లపై అనుచిత చర్యలు అనుచితం అని హక్కుల సంఘం పేర్కొంది.