Thursday, April 25, 2024

ఐఎన్‌ఎస్ విరాట్‌కు తుది వీడ్కోలు పలికిన నౌకాదళం

- Advertisement -
- Advertisement -

INS Viraat sets sail for Gujarat, to be dismantled

ముంబై: భారత నౌకా దళం నుంచి విరమించిన యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విరాట్ తుక్కుగా మారేందుకు గుజరాత్‌లోని అలంగ్ పోర్టుకు శనివారం ఇక్కడి నౌకాదళ డాక్ యార్డు నుంచి బయల్దేరింది. మూడు దశాబ్దాలకు పైగా భారత నౌకాదళానికి సేవలంద చేసి చివరకు విడిభాగాలుగా ముక్కలై.. తుక్కుగా మారనున్న విరాట్‌కు నౌకాదళ సిబ్బంది భావోద్వేగంతో వీడ్కోలు పలికారు.
2017లో భారత నౌకాదళం నుంచి సేవలను ఉపసంహరించుకుని అప్పటి నుంచి డాక్ యార్డులోనే ఉన్న ఐఎస్‌ఎస్ విరాట్ తన చివరి మజిలీకి శనివారం బయల్దేరి వెళ్లింది. బ్రిటన్‌లోని రాయల్ నేవీకి హెచ్‌ఎంఎస్ హెర్మెస్‌గా సేవలందచేసిన ఈ యుద్ధనౌక భారత నౌకాదళంలోకి ప్రవేశించిన తర్వాత ఐఎన్‌ఎస్ విరాట్‌గా నామకరణం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News