Home మంచిర్యాల పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

Insecticid Drug drink is farmer committed suicide

లక్షెట్టిపేట: మండలంలోని గంపలపల్లి గ్రామానికి చెందిన రాందేని శ్రీనివాస్(43) అనే రైతు పురుగుల మందు త్రాగి మరణించినట్లు శుక్రవారం ఎస్ఐ మధుసుదన్‌రావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం… మృతునికి ఉన్నటువంటి ఐదెకరాల భూమిలో మూడెకరాలు వరి, రెండు ఎకరాలు పత్తి సాగుచేశాడన్నారు. వ్యవసాయం సాగుకు సుమారు ఆరు లక్షల వరకు అప్పు చేశాడని అప్పు తీర్చడం ఎలా అని తరచూ భాదపడుతుండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. గత రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అప్పు తీర్చడం ఎలా అని భాదపడుతూ ఇంట్లో ఉన్నటువంటి గడ్డికి కొట్టే మందు త్రాగడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడని అప్పుడే ఇంటికి వచ్చిన కుటుంబికులు గమనించి లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఇక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని భార్య కళావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.