Home తాజా వార్తలు కానిస్టేబుల్ అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన ప్రారంభం

కానిస్టేబుల్ అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన ప్రారంభం

Constable Candidates

 

వరంగల్‌ : తెలంగాణ రాష్ట్ర పోలీస్‌శాఖలోని వివిధ విభాగాల్లో కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియలో భాగంగా తెలంగాణ పోలీస్ నియామక మండలి నిర్వహించిన తుది రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల ధృవీకరణ పత్రాల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రారంభమైంది. నేటి నుండి మూడు రోజుల పాటు నిర్వహించే ధృవీకరణ పత్రాల స్వీకరణలో కార్యక్రమంలో అధికారులు అభ్యర్థుల నుండి విద్యార్హతలతో పాటు ఇతర అర్హతలకు సంబంధించిన పత్రాలకు సంబంధించి గెజిటెడ్ అధికారితో ధృవీకరించబడిన నాలుగు జిరాక్స్ సెట్లతో పాటు అభ్యర్థులకు సంబంధించి పాస్‌పోర్ట్ పైజు ఫొటోలను అధికారులు అభ్యర్థుల నుండి స్వీకరించారు. అదేవిధంగా ఈనెల 18 నుండి 28వ తేదీ వరకు నిర్వహించే వైద్య పరీక్షల్లో భాగంగా అభ్యర్థులు హాజరుకావాల్సిన తేదీలను అధికారులు ఎంపికైన అభ్యర్థులకు సూచించారు.

ధ్రువీకరణ పత్రాల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించిన సిపి
తుది పరీక్ష ఎంపికాబడిన కానిస్టేబుళ్ల ధృవీకరణ పత్రాల స్వీకరిస్తున్న తీరును శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ సందర్శించారు. ఈ సందర్భంగా అభ్యర్థుల నుండి అధికారులు స్వీకరిస్తున్న పత్రాల వివరాలను పోలీస్ కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు కానిస్టేబుళ్లు ఎంపికై ధృవీకరణ పత్రాల అందజేయడానికి హాజరైన అభ్యర్థులకు పోలీస్ కమిషనర్ ముందుగా అభినందనలు తెలిపారు. పత్రాల స్వీకరణ సందర్భంగా ఏదైనా సమస్యలు ఉన్నాయని సిపి రవీందర్ అభ్యర్థులను అడిగితెలుసుకున్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో అదనపు డిసిపిలు వెంకటలక్ష్మి, గిరిరాజు, పరిపాలనాధికారి ప్రమీల, ఆర్‌ఐలు సతీష్, శ్రీనివాస్‌రావు పరిపాలన సిబ్బంది పాల్గొన్నారు.

Inspection of Certificates of Constable Candidates