Home టెక్ ట్రెండ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో నయా ఫీచర్

ఇన్‌స్టాగ్రామ్‌లో నయా ఫీచర్

Instagramముంబై: ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్ నయా ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇన్‌స్టా ఖాతాదారులు ఇక నుంచి తమకు నచ్చిన పాటల్ని, స్టోరీస్ తో జోడించే విధంగా ఈ కొత్త ఆప్షన్ ప్రవేశపెడుతోంది. గత సంవత్సరం మార్చిలోనే పలు దేశాల్లో ఈ ఫీచర్ ను అందుబాటులోకి రాగా… తాజాగా భారత్ లో కూడా అప్ డేట్ ను తీసుకురానుంది. స్టోరీస్ ఆప్షన్ లోకి వెళ్లి స్టిక్కర్స్ బటన్ నొక్కితే ఈ ఫీచర్ కనిపిస్తోంది. మ్యూజిక్ ఆప్షన్ కనిపించకపోతే యాప్ ను డిలీట్ చేసి మళ్లీ ఇన్‌స్టాల్ చేస్తే మీరు దీన్ని పొందవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ లో వచ్చే ఈ మ్యూజిక్ యాప్ లో 3 రకాల సదుపాయాలు ఉన్నాయి. పాపులర్ సాంగ్స్, మోడ్స్, జెనర్స్. వీటి ద్వారా మీకు నచ్చిన పాటల్ని బ్రౌజ్ చేసి స్టోరీస్ కు జోడించకోవచ్చునని ఇన్‌స్టా పేర్కొంది.

Instagram Music now available in India