Home తాజా వార్తలు జాతీయ జెండాకు అవమానం

జాతీయ జెండాకు అవమానం

Insult to the national flag at vikarabad

 

వికారాబాద్:  వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చదువులమ్మ తల్లికి నిలయంగా చెప్పుకుంటున్న జిల్లా గ్రంథాలయ సంస్థలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మురళికృష్ణగౌడ్ జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారు. తలకిందులుగా ఎగిరిన జాతీయ జెండాను గమనించిన స్థానిక ఎమ్మెల్యే సెక్రటరీ జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారు. వరుసగా ఇది జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో రెండవ సారి అవుతోందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

ఇది గమనించి గ్రంథాలయ సంస్థ కార్యదర్శి జెండాను కిందికి దించి సరిచేయించే ప్రయత్నం చేశారు. అయితే కిందికి దించి సరిచేయించే క్రమంలో కార్యాలయ ఉద్యోగి తన కాళ్ళపై జెండాను వేసుకుని సరిచేశాడు. అనంతరం తిరిగి జాతీయ జెండాను ఎగురవేశారు. కాగా ఇలా జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా వేడుకల్లో ఇలా తలకిందులుగా ఎగురవేయడం రెండవసారి. బాధ్యత లేకుండా భయం లేకుండా అధికారులు వ్యవహరించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో చదువుకోని వ్యక్తులు తలకిందులుగా ఎగురవేశారంటే వేరు కాని చదవుల ఒడిలో అందిరికి విజ్ఞానాన్ని అందిచే గ్రంథాలయంలోనే ఇలా జరిగితే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

తప్పు ఒకరిది… శిక్ష మరొకరికా…?
జిల్లా గ్రంథాలయ కార్యదర్శిపై విమర్శలు
స్వాతంత్య్ర వేడుకలను, జెండా ఎగురవేసే కార్యక్రమాన్ని దగ్గరుండి చూసుకోవాల్సిన జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సురేష్ కుమార్ నిర్లక్షంగా వ్యవహరించారని పలువురు విమర్శిస్తున్నారు. జెండా కార్యక్రమాన్ని తను దగ్గరుండి సరి చూసుకుని ఎగురవేసేలా చేయాల్సిన కార్యదర్శి కింది స్థాయి సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాను విధుల పట్ల నిర్లక్షంగా వ్యవరిస్తుంటారని, బాధ్యతారహితంగా మసలుకొంటారని విమర్శలు ఉన్నాయి. అక్కడే ఉన్న స్థానిక ఎమ్మెల్యే కార్యదర్శి గారు గత సంవత్సరం లాగే ఈసారి కూడా తలకిందులుగా ఎగురవేశారంటూ సున్నితంగా మందలించారు. తన తప్పును అసిస్టెంట్ లైబ్రేరియన్, మరో గ్రేడ్ 3 లైబ్రేరియన్లను బాధ్యులుగా వక్రీకరిస్తూ మీపై ఎందుకు చర్యలు తీసుకోరాదంటూ మెమోలు ఇవ్వడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. తప్పు ఒకరిదైతే.. శిక్ష మరొకరికా అంటే పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Insult to the national flag at vikarabad