Home తాజా వార్తలు మందులపై నిఘా లేకపోవడంతోనే తప్పిదాలు జరుగుతున్నాయి: వైద్యులు

మందులపై నిఘా లేకపోవడంతోనే తప్పిదాలు జరుగుతున్నాయి: వైద్యులు

SAROJINIహైదరాబాద్: టిఎస్‌ఎంఐడిసి సంస్థను రద్దు చేయాలని సరోజినీ వైద్యులు తెలిపారు. టిఎస్‌ఎంఐడిసి సంస్థలో గత ఐదేళ్లుగా క్వాలీటీ కంట్రోల్ పోస్టును భర్తీ చేయలేదని వైద్యులు పేర్కొన్నారు. మందులపై నిఘా లేకపోవడంతోనే తప్పిదాలు జరుగుతున్నాయన్నారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి మందులు సరఫరా చేయాలన్నారు. ఐవి ఫ్లూయిడ్స్‌ను హసీబ్ అనే సంస్థ నుంచి సరఫరా చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

సరోజినీ ఆస్పత్రిలో రోగులను కాంగ్రెస్ నేతలు సుధీర్ రెడ్డి, ప్రసాద్ కుమార్, భిక్షపతి యాదవ్, తదితరులు పరామర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రోగులు చూపూ కోల్పోయారన్నారు. మందులు సరైనవా కావా అనే చూసే బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు. కళ్లు కోల్పోయిన వారికి కెసిఆర్ కళ్లు ఇస్తారా? అని ప్రశ్నించారు. ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.