Home జాతీయ వార్తలు తమిళనాడులో పూర్తి లాక్‌డౌన్

తమిళనాడులో పూర్తి లాక్‌డౌన్

Intense Lockdown In Tamil Nadu On Sunday

 

చెన్నై: ఆదివారం తమిళనాడు రాష్ట్రమంతటా పూర్తి లాక్‌డౌన్‌ను అమలు చేశారు. దాంతో, చెన్నైలోని రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. దుకాణాలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. జూలై నెలంతా ఆదివారాల్లో ఎలాంటి సడలింపులు లేకుండా లాక్‌డౌన్‌ను అమలు చేస్తామని తమిళనాడులోని ఎఐఎడిఎంకె ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఆస్పత్రులు, మందుల దుకాణాలులాంటి ఆరోగ్య సేవలకు మాత్రమే లాక్‌డౌన్ నుంచి మినహాయింపులిచ్చారు.

చెన్నైతోపాటు పలుచోట్ల నిత్యావసరాలైన కూరగాయలు, కిరాణ దుకాణాలు కూడా మూతపడ్డాయి. లాక్‌డౌన్ కచ్చితంగా అమలయ్యేలా పర్యవేక్షించేందుకు పోలీస్ పహారాను పెంచారు. కరోనా కేసులు అధికంగా నమోదైన రాష్ట్రాల్లో తమిళనాడు రెండో స్థానంలో ఉన్నది. ఇప్పటికే లక్షకుపైగా కేసులు ఆ రాష్ట్రంలో నమోదయ్యాయి. చెన్నై, తిరువల్లూర్, కాంచీపురం, చెంగల్‌పట్టు, మదురైల్లో కరోనా కేసులు అధికంగా ఉన్నాయి. ఈ రాష్ట్రానికి చెందిన 9మంది ఎంఎల్‌ఎలు కూడా కరోనా బారిన పడ్డారు.

Intense Lockdown In Tamil Nadu On Sunday