Saturday, March 25, 2023

28 నుంచి ఇంటర్ పరీక్షలు

- Advertisement -

Sri-Chaitanya-Jr.-College

మన తెలంగాణ/వరంగల్ బ్యూరో: ఈనెల 28వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎస్.దయానంద్ కోరారు. శుక్రవారం మధ్యాహ్నం తన క్యాంపు కార్యాలయంలో ఇంటర్మీడియట్ పరీక్షలకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 28 నుంచి వచ్చే నెల 17 వరకు జిల్లాలోని 53 సెంటర్లతో జరగనున్న ఈ పరీక్షలకు గాను జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి సూచించిన ప్రదేశాల నుంచి తప్పనిసరిగా రోడ్డు రవాణ సంస్థ వారు బస్సులు ఏర్పాటు చేయాలని, అలాగే విద్యాశాఖాధికారి ఇన్విజిలేటర్లుగా ఉపాధ్యాయులకు విధులు కేటాయించాలని, పరీక్షల కాలంలో విద్యుత్ సరఫరాలో ఎటువంటి అవాంతరాలు లేకుండా చూడాలని విద్యుత్ శాఖవారిని ఆదేశించారు. పోలీస్‌శాఖ తరపున పరీక్షలకు, ఫ్లైయింగ్ స్కాడ్‌లకు తగు బందోబస్తు ఏర్పాటు చేయాలని, స్ట్రాంగ్ రూంకు భద్రత కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి ఎం.లింగయ్య, జిల్లాకు వచ్చిన హైపవర్ కమిటీ ప్రతినిధి కె.ప్రశాంతతో పాటు పోలీస్, విద్యాశాఖ ఆర్టిసి, తదితర శాఖల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News