Home రాష్ట్ర వార్తలు మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు

మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు

 ts1

సవరించిన పరీక్షల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ : ఇంటర్ వార్షిక పరీక్షల సవరించిన షెడ్యూల్‌ను ఇంటర్మీడియెట్ బోర్డు ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 1వ తేదీ బదులు ఫిబ్రవరి 28వ తేదీ నుంచే ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. అలాగే మార్చి 3వ తేదీ బదులు మార్చి 1వ తేదీ నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. కాగా ఫిబ్రవరి 28వ తేదీ నుంచే ఇంటర్ పరీక్షలు ప్రారంభిస్తున్నట్లు ఎపి ప్రభుత్వం ప్రకటించింది. అయితే రెండు రాష్ట్రాలలో ఆఫ్షనల్ సబ్జెక్టుల సిలబస్ ఒకే విధంగా ఉన్నాయి. ఆఫ్షనల్ సబ్జెక్టు పరీక్షను ఎపిలో ఒకరోజు ముందుగానే నిర్వహించడం మూలంగా ప్రశ్నపత్రంలో లీకేజీలు జరుగుతాయనే ప్రచారం ఊపందుకోవడంతో అప్రమత్తమైన తెలంగాణ ఇంటర్ బోర్డు మార్చి 1 బదులు ఫిబ్రవరి 28 నుంచే పరీక్షలు ప్రారంభించాలని నిర్ణయించింది. ఆ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేసింది.