Home Default అక్టోబర్ 25 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు : సబితా ఇంద్రారెడ్డి

అక్టోబర్ 25 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు : సబితా ఇంద్రారెడ్డి

Inter Exams From October 25th : Sabitha Indra Reddyహైదరాబాద్ :  రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఈ నెల 25వ తేదీ  నుంచి ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్ పరీక్షలపై ఆమె అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గతంలో కరోనా కారణం గా ప్రమోట్ చేసిన విద్యార్థులకు ఇప్పుడు పరీక్షలు పెడుతున్నామని ఆమె చెప్పారు. నాలుగు లక్షల యాభై వేలకు పైగా విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారని, ఇంటర్ పరీక్షల కోసం జిల్లా స్థాయిలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను 1750కి పెంచామని ఆమె చెప్పారు. 25వేల మంది ఇన్విజిలేటర్ లు ఇంటర్ పరీక్షల్లో విధులు నిర్వర్తిస్తారని ,  ప్రతి పరీక్ష కేంద్రంలో ఐసోలేషన్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని ఆమె వెల్లడించారు. గంట ముందు పరీక్షా కేంద్రం లోకి విద్యార్ధులకు అనుమతి ఇస్తామని, ప్రైవేట్ యాజమాన్యాలు పరీక్ష నిర్వహణకు సహకరించాలని ఆమె స్పష్టం చేశారు. ప్రైవేట్ జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం తీరుపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి  ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల సమయంలో విద్యార్థులను  ఇబ్బందులు పెట్టొద్దని ఆమె హెచ్చరించారు.