Home తాజా వార్తలు తప్పు చేసినవారిపై కఠిన చర్యలు: అశోక్ కుమార్

తప్పు చేసినవారిపై కఠిన చర్యలు: అశోక్ కుమార్

Inter board secretary Ashok Kumar

 

హైదరాబాద్: ఇంటర్ వాల్యుయేషన్ పారదర్శకంగా జరిగిందని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ అన్నారు. ఒఎంఆర్ బబ్లింగ్ లో ఎగ్జామినర్ పొరపాటు చేశారని, 9 నెంబర్ బబ్లింగ్ చేయడానికి బదులు 0 బబ్లింగ్ చేశారని వెల్లడించారు. సోమవారం అశోక్ మీడియాతో మాట్లాడారు. తప్పు చేసిన అధికారులను వివరణ కోరామని, తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని అశోక్ కుమార్  చెప్పారు. మా దృష్టికి వచ్చిన తప్పులను సరి చేశామని, అలాగే సెంటర్ మారడం వల్ల కూడా సమస్యలు వచ్చాయన్నారు. ఏ ఒక్క పేపర్ గల్లంతు కాలేదని, జవాబు పత్రాలు పోలీసుల కస్టడీ మధ్య భద్రంగా ఉన్నాయని, పరీక్షలు రాయని వాళ్లను పాస్ చేయడం కుదరదని, పాసైన వారిని ఫెయిల్ చేయడం జరగలేదని స్పష్టం చేశారు.

15 ఏళ్లుగా మాన్ టెక్ సంస్థ సాంకేతిక వ్యవహారాలు చూస్తోందని, ఈసారి ఆటోమేషన్ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఈ టెండర్ల ద్వారా గ్లోబరేనా కంపెనిని ఎంపిక చేసి టెండర్ ఇచ్చిన్నట్టుగా అశోక్ కుమార్ తెలిపారు. ఈ టెండర్ల వ్యవహారంలో ఎలాంటి తప్పు జరగలేదని, కావాలంటే జవాబు పత్రాలను చూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రీ వాల్యుయేషన్ లో మారిన మార్కులను ఈ మెయిల్ ద్వారా పంపుతామని, అవసరమైతే రీ వాల్యుయేషన్ తేదీని పొడగిస్తామన్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ… అవసరమనుకుంటే దరఖాస్తు గడువు పెంచుతామని, ఉచితంగా రీ వాల్యుయేషన్ చేయడం కష్టమన్నారు. పేపర్ వాల్యుయేషన్ లో పొరపాట్లు ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, టెక్నికల్ కమిటీ వేశామని.. మూడు రోజుల్లో నివేదిక వస్తుందన్నారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని జనార్ధన్ రెడ్డి వెల్లడించారు.

Inter Exams Revaluation Conducted in Telangana