Home తాజా వార్తలు సర్వం సిద్ధం

సర్వం సిద్ధం

inter-exams

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం
సర్వం సిద్ధం చేసిన అధికారులు
9 దాటి నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

మన తెలంగాణ /సిటీ బ్యూరో
ఇంటర్మీడియట్ పరీక్షలకు జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు. బుధవారం(నేటి) ఉదయం 9 గంటలకు ఇంటర్ ప్రథమ సంవత్సరం ద్వితీయ భాష పేపర్ 1తో పరీక్షతో మొదలై మార్చి 19వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అయితే ప్రధాన పరీక్షలు మార్చి 14తో ముగియనుండగా, ఇతర సబ్జెక్టులకు సంబంధించివి 19వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ ఏ డాది కూడా ఒక నిమిషం నిబంధనను ఖచ్చితంగా అమలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఉదయం 9 గంటలు దాటిన తర్వాత ఒ క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని, విద్యార్థులందరూ సకాలంలో (8.30 గంటల లోపే) పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. జిల్లాకు సంబంధించి ప్రథమ సంవత్సరానికి గాను 74, 209 మంది, ద్వితీయ సంవత్సరం గాను 73, 514, ప్రైవేట్ విద్యార్థులు 17,970 మొత్తం 1,65,693 మంది విద్యార్థులు ఈ పరీక్షలను రాయనున్నారు. వీరి కోసం 196 సిద్ధ్దం చేశారు. పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల ముగియనుంది. విద్యార్థులను ఉదయం 8.30 నుంచి 8.45 వరకు పరీక్షా కేంద్రాలకు అనుమతించనున్నారు. విద్యార్థులు www.tsble.tgg. gov.in వెబ్ సైట్ ద్వారా కూడా ఆన్‌లైన్ లో హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చాని అధికారులు ప్రకటించారు. ప్రిన్సిపల్ సంతకాలు లేకున్న పరీక్షలకు అనుమతించాలని చీఫ్ సుపరిన్‌టెండంట్లకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఇంటర్మీడియేట్ జిల్లా విద్యా అధికారి కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. పరీక్షలకు సంబంధించి ఏలాంటి ఇబ్బందులు ఎదురైనా 040 23241530 నంబర్‌కు పోన్ చేస్తే అధికారులు వెంటనే సమస్యలను పరిష్కరించనున్నారు.

నిమిషం అలస్యమైనా పరీక్షకు నిరాకరణ : ఇంటర్ విద్యార్థులు 9 గంటలు దాటి నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష రాసే అవకాశం కోల్పోయినట్లే. 8గంటలకులోపే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సిందిగా ఇంటర్ విద్యా జిల్లా అధికారి(డిఐఇఒ) జయప్రద బాయి సూచించారు. నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆమె వెల్లడించారు. పరీక్షల ఏర్పాట్లకు సంబంధించి ఈనెల 15న సమావేశమైన జిల్లా పరీక్ష కమిటీ పరీక్షలను విజయంతంగా పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం యావత్తు సమన్వయంతో పనిచేసేలా ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసి ఆయా శాఖల అధికారులకు అందజేశామన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లే మార్గాలల్లో ట్రాఫిక్ నియంత్రణతో పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు శాఖ ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

ప్రతి రోజు పరీక్ష ముగిసే వరకు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. సమీప పోలీసు స్టేషన్లల్లో భద్రపర్చిన ప్రశ్నా పత్రాలను పరీక్ష సమాయానికి పోలీసు బందోబస్తు మధ్య ఆయా పరీక్ష కేంద్రాలకు ప్రశ్నా పత్రాలను తీసుకువెళ్లనున్నరన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి డిఐఇఓ కన్వీనర్‌గా మరో 4 సభ్యులతో కూడిన జిల్లా పరీక్షల కమిటీతో పాటు హై పవర్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. పరీక్షను నిర్వహణను ఈ కమిటీలు పర్యవేక్షిస్తాయని చెప్పారు. అదే విధంగా పరీక్షల నిర్వహణకు 193 చీఫ్ సూపరిన్‌టెండెండ్లతో పాటు వివిధ శాఖల నుంచి మరో 193 మంది అధికారులను నియమించామన్నారు. మాల్ ప్రాక్టీస్‌ను చోటు చేసుకోకుండా 4ప్లైయింగ్‌స్కాడ్, మరో 4 సిట్టింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. పరీక్షా కేంద్రాలలో అత్యవసర మెడికల్ కిట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లతో పాటు ఒకే ప్రాంతంలో అధిక సెంటర్లు ఉన్న వద్ద ఎఎన్‌ఎంలు ఉండేలా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేయగా, అన్ని పరీక్షా కేంద్రాలలో నిరంతరాయ విద్యుత్ ఉంటే విధంగా విద్యుత్ శాఖ పర్యవేక్షిస్తుందన్నారు. పరీక్ష నిర్ణీత వేళ్లల్లో విద్యార్థులకు ఏలాంటి అసౌకర్యం కల్గకుండా అన్ని పరీక్ష కేంద్రాల రూట్లలో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడపనుందని ఆమె చెప్పారు.