Home మహబూబ్‌నగర్ అంతరాష్ట్ర దొంగలముఠా సభ్యురాలు అరెస్టు

అంతరాష్ట్ర దొంగలముఠా సభ్యురాలు అరెస్టు

Gold-Jewellry-22తులాల బంగార ఆభరణాలు స్వాదీనం
జడ్చర్ల: అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యురాలు వరలక్ష్మిని అరెస్టుచేసి 22తులాల బంగారు ఆభరణాలను రికవరి చేసినట్లు మహబూబ్‌నగర్ డీఎస్పీ కృష్ణమూర్తి తెలిపారు. గురువారం సాయంత్రం జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన దొంగల ముఠా వివరాలు వెళ్లడించారు. డీఎస్పి కథనం మేరకు వివరాలు చీరాలకు చెందిన ఈ దొంగల ముఠా ముగ్గురు ముగ్గురుగా ఒక గ్యాంగ్ ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతుంటారని తెలిపారు. ఈ గ్యాంగ్ సభ్యులు విజయకుమారి, వరలక్ష్మి, అంజమ్మ, బ్రహ్మయ్య, వెంకటేశ్, అలివేలలు మరో ఇద్దరితో రెండు గ్రూపులుగా ఏర్పడి బస్సులలో ప్రయాణికుల మాదిరిగా ప్రయాణాలు చేస్తూ మహిళల బ్యాగులలో ఉన్న నగలను దోచుకోవడం జరుగుతుందన్నారు. మహిళలు దొంగతనాలు చేసి ఆపక్కనే సపోర్టుగా ఉన్న పురుషులకు వాటిని అందజేసి అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుందన్నారు. దోచుకున్న సొమ్మును అందరు సమానబాగాలుగా పంచుకుంటారని తెలిపారు. గ్యాంగ్‌లో ఎవరైన జైల్లో ఉన్నా వారికి దొంగసొమ్ములో బాగం ఇస్తారని తెలిపారు. దొంగతనాలు చేసే వారికి మరికొందరు దొంగసొమ్మును అమ్మెవారు ఉంటారని తెలిపారు. ఈముఠాలపై మహబూబ్‌నగర్ జిల్లాలో 7 కేసులు, దేవరకొండలో ఒక కేసు వీరిపై ఉన్నట్లు డీఎస్పి తెలిపారు. వీరు మొత్తం 77తులాల బంగారం దోచుకున్నట్లు తెలిపారు. జడ్చర్లలో 3కేసులు, నాగర్‌కర్నూల్‌లో 3కేసులు, కొత్తూర్ పోలీస్‌స్టేషన్‌లో1 కేసు ఉన్నట్లు తెలిపారు. గత సెప్టెంబర్9న నలుగురు దొంగల ముఠా విజయలక్ష్మి, బ్రహ్మయ్య, అంజమ్మ, వెంకటేశ్‌లు పట్టుబడినారని వారి నుండి 18తులాల బంగారు ఆభరణాలు రికవరి చేసినట్లు తెలిపారు. ఆ సమయంలో వరలక్ష్మి గ్యాంగ్ పరారిలో ఉన్నదని తెలిపారు. ఈ క్రమంలో గురువారం జడ్చర్ల మండల పరిధిలోని మన్సూర్ దాబాదగ్గర బస్సులో ప్రయాణిస్తున్న వరలక్ష్మిని పట్టుకున్నట్లు తెలిపారు. వరలక్ష్మి బస్సులో ప్రయాణిస్తుందన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌ఐ మదుసూదన్‌గౌడ్ ఆధ్వర్యంలో ఎఎస్‌ఐ ఖాజాఖాన్, శ్రీను, సంపూర్ణలు అక్కడికి చేరుకుని దొంగల ముఠా సభ్యురాలు వరలక్ష్మిని పట్టుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆమెనుండి 22తులాల బంగారు ఆభరణాలు రికవరి చేసినట్లు తెలిపారు. మిగతా 37తులాల బంగారం రికవరి కావాల్సి ఉందని ఇందులో అలివేలు అనే ఈ ముఠా సభ్యురాలు పరారిలో ఉందని, ఆమె పట్టు బడితే మిగతా బంగారం బయటపడే అవకాశం ఉందన్నారు. దొంగల ముఠాను పట్టుకున్నపోలీసులకు డీఎస్పి కృష్ణమూర్తి రివార్డులు అందజేశారు. ఈ సమావేశంలో జడ్చర్ల సీఐ జంగయ్య, ఎస్‌ఐ మధసూధన్‌గౌడ్, తదితరులు ఉన్నారు