Thursday, April 18, 2024

కత్తితో గొంతుకోసి ఇంటర్ విద్యార్థిని హత్య

- Advertisement -
- Advertisement -

Inter student murder

 

కరీంనగర్‌లో ఘాతుకం, ఇంటిలో ఒంటరిగా ఉండగా దాడి
దుండగుడి కోసం గాలింపు, హంతకుడు మైనర్ బాలుడు?

మన తెలంగాణ/కరీంనగర్ క్రైం :కరీంనగర్ జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. మైనర్ బాలుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలిని కరీంనగర్ కమీషనరేట్ అడిషనల్ డిసిపి (ఎల్‌అండ్‌ఓ) శ్రీనివాస్ పరిశీలించారు. 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకుంటామని ఆయన తె లిపారు. విద్యార్థిని హత్యకు సం బంధించిన వివరాలు ఇలా ఉన్నా యి. నగరంలోని విద్యానగర్ ప్రా ంతానికి చెందిన ముత్తి కొముర య్య అనే వ్యక్తి హమాలీ పని చే సుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తె ముత్తి రాధిక (18) స్థానిక ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఇదిలా ఉండగా రాధికకు చిన్ననాటి నుంచే రెండు కాళ్ళు దగ్గరగా ఉండడంతో నడవడానికి కష్టంగా ఉండేది.

నాలుగు సంవత్సరాల క్రితం ఆమెకు ఆపరేషన్ చేయించగా ఇప్పుడిప్పుడే అందరిలా నడువగలుగుతుంది. అయితే ఎప్పటిలాగే కొమురయ్య హమాలీ పనికి వెళ్లగా, హతురాలి తలి ్లసైతం పని మీద బయటకు వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మధ్యాహ్నం దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి ఒంటరిగా ఉన్న రాధిక గొంతు కోసి హతమార్చాడు. రాధిక గొంతు కోసిన ఆనంతరం కత్తిని శుభ్రంగా కడిగి అక్కడే వదిలేసి పారిపోయాడు. సాయంత్రం పను ల నుంచి ఇంటికి తిరిగి వచ్చిన హతురాలి మేనమామ ఇంటి తలుపులు తీయ గా రాధిక రక్తపుమడుగులో పడి ఉండడాన్ని గమనించి చుట్టుపక్కల వారికి తెలిపాడు. సమాచారం అందుకున్న కరీంనగర్ టూటౌన్ పోలీసులు సహా డాగ్‌స్కాడ్, ఫింగర్‌ప్రింట్స్ నిపుణులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరిపారు.

సంఘటనపై కరీంనగర్ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా కరీంనగర్ కమీషనరేట్ అడిషనల్ డిసిపి ఎస్.శ్రీనివాస్ (ఎల్‌అండ్) విలేకరులతో మాట్లాడుతూ… రాధిక ను తెలిసిన వ్యక్తే హత్య చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. హత్యకు పాల్పడిన వ్యక్తిని 24 గంటల్లో పట్టుకుంటామని తెలిపారు. ఘటనాస్థలాన్ని సందర్శించిన రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. హతురాలు రాధిక కుటుంబాన్ని అన్ని విధాలుగా అదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

Inter student murder in Karimnagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News