Home రాష్ట్ర వార్తలు దారుణ హత్య

దారుణ హత్య

mrdr

కూకట్‌పల్లిలో పట్టపగలు ఇంటర్ విద్యార్థిని వెంటాడి చంపిన దుండగులు

మన తెలంగాణ/ హైదరాబాద్/ మూసాపేట/ కూకట్‌పల్లి: ఇంటర్మీడియట్ పరీక్ష లు రాయడానికి వెళ్తున్న విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. కూకట్‌పల్లిలోని జాతీయ రహదారిపై సోమవారం ఉద యం సినీఫక్కీలో చోటుచేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే…. మూసాపేటకు చెందిన పాలరాజు కుమారుడు ఎలజల సుధీర్ (19) కూకట్‌పల్లి ప్రతిభ కాలేజీలో ఇం టర్ రెండో సంవత్సరం సిఇసి గ్రూపు చదువుతున్నాడు. సోమవారం కూకట్‌పల్లి చైతన్య ఐఐటి క్యాంపస్‌లో పరీక్ష రాయడానికి ఉదయం 8 గంటల సమయంలో మూసాపేటకు చెందిన తన స్నే హితులు మేఘనాథ్, సుధీర్, సాయిలతో కలిసి బైకుపై బయలుదేరాడు. కూకట్‌పల్లి మెట్రో ఎదురుగా ఉన్న సాగర్ హోటల్ వద్ద అప్పటికే వేట కొడవళ్ళతో కాపు కాసిన నలుగురు యువకులు సుధీర్‌పై దాడికి యత్నించారు. విషయా న్ని గమనించిన సుధీర్ బైకును అక్కడే వదిలేసి వేగంగా వెళ్తున్న ప్రైవేటు స్కూల్ బస్సును ఎక్కబోతుండగా దుండగులు అతని చొక్కా పట్టుకొని కిందికిలాగేశారు. అనంతరం వేట కొడవళ్ళతో తల, మెడభాగంలో నరకడంతో సుధీర్ నడిరోడ్డుపై రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. పట్టపగలు ట్రాఫిక్ పోలీసులు , వాహనదారులు చూస్తుండగానే రెప్పపాటు సమయంలో ఈ దారుణం చోటు చోసుకుంది. అత్యంత ట్రాఫిక్ రద్దీ కలిగి ఉండే కూకట్‌పల్లి జాతీయ రహదారిపై చోటుచేసుకున్న దారుణ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. హత్య జరగడంతో ట్రాఫిక్ గంటల తరబడి స్తంభించిపోయింది. ఇంటర్మీడియట్ పరీక్షలకు వెళ్ళే విద్యార్థ్ధులు ఇబ్బందులకు గురయ్యారు. హత్యకు పాల్పడిన నలుగురు యువకుల్లో ముగ్గురు పరారీకాగా ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. సంఘటనా స్థలాన్ని కూకట్‌పల్లి ఎసీపీ భు జంగరావు, సిఐ ప్రసన్నకుమార్‌లు పరిశీలించి శవాన్ని పోస్టుమార్టం నిమి త్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు.

పాతఘర్షణలకు ప్రతీకారంగానే హత్య!
పాతఘర్షణలకు ప్రతీకారంగానే హత్య జరిగినట్లు విశ్వసనీయంగా తెలసింది. గతంలో మృతుడు సుధీర్‌కు గతంలో మిత్రులుగా ఉన్న వారే హత్యకు పాల్పడినట్లు సమాచారం. సుధీర్ స్నేహితులుగా భావిస్తున్న నవీన్, కృష్ణ, మహేష్, తేజలు ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా భావిస్తున్న పోలీసులు వారికోసం గాలిస్తున్నారు. ఈనెల 9న మృతుడు సుధీర్ తన ప్రాణ స్నేహితుడి చెల్లెలును మహేష్ అనే నిందితుడు వేధించడంతో సుధీర్ మహేష్‌తోపాటు అతని స్నేహితులతో ఘర్షణ పడ్డారు. దీంతో వారిపై కూకట్‌పల్లి పోలీసు స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. ఒక అమ్మాయిని ఏడిపించానని తనపైనే దాడిచేస్తావా అని మనసులో కసి పెంచుకున్న జిల్లా మహేష్‌తోపాటు తేజ, నవీన్, కృష్ణలు సుధీర్‌ను ఎలాగైనా చంపాలన్న కసితో కొబ్బరిబొండాలు కొట్టే కత్తులతో దాడి చేసి ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడితోపాటు నిందితులు కూడా ఇంటర్మీడియట్ చదువుతున్న వారేనని తెలిసింది. వీరికి గంజాయి, డ్రగ్స్ , లిక్కర్ అలవాట్లు కూడా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తే తెలిసీ తెలియని వయస్సులో ఉన్న యువకులు మాదకద్రవ్యాల వాడకం, హత్యలు చేయడానికి కూడా వెనకాడకపోవడానికి కారణాలు వెలుగుచూసే అవకాశం ఉంది.