Friday, March 29, 2024

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రద్దు

- Advertisement -
- Advertisement -

Inter supplementary exams cancelled

 

ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైన వాళ్లంతా పాస్
1.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
31 తర్వాత కాలేజీల్లో మార్కుల మెమోలు జారీ
10 రోజుల్లో రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫలితాలు
కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్నిదృష్టిలో పెట్టుకుని సిఎం కెసిఆర్ నిర్ణయంవిద్యాశాఖ – మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సారి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మార్చి 2020 ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులందరినీ పాస్ చేస్తూ సిఎం నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి దృష్టా ఈ నిర్ణ యం తీసుకున్నట్టు మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు.

ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉత్తీర్ణత పొందిన వా రందరిని మార్కుల జాబితాలో కంపార్ట్‌మెంటల్‌లో ఉ త్తీర్ణులైనట్లుగా పేర్కొనడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 1.47 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించిన మార్కుల మెమోలను ఈ నెల 31 తర్వాత సంబంధిత కళాశాలల్లో పొందవచ్చని పేర్కొన్నారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఫలితాలను 10 రోజుల తర్వాత అందజేస్తమని మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులు, ఇంప్రూమెంట్ రాయాలనుకునే విద్యార్థులు వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్ వార్షిక పరీక్షల్లో రాయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.

ద్వితీయ సంవత్సరంలో 68.86% ఉత్తీర్ణత
ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఈ ఏడాది 68.86 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 4,11,631 మంది పరీక్షలు రాయగా, 2,83,462 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 60.01 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రథమ సంవత్సరం పరీక్షలకు మొత్తం 4,80,555 మంది విద్యార్థులు రాయగా, 2,88,383 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది మార్చి 4వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరిగిన ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షలు జరుగగా, గత నెల 18వ తేదీన ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులందరికీ ప్రయోజనం చేకూరనుంది.

ఇంటర్ జెఎసి హర్షం
ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఫెయిలయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు లేకుండా పాస్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఇంటర్ విద్య జెఎసి ఛైర్మన్ పి. మధుసూదన్ రెడ్డి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. 1.47 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డికి, విద్యాశాఖ స్పెసల్ సిఎస్ చిత్రారామచంద్రన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News