Home నిర్మల్ అంతర్ జిల్లా దొంగ అరెస్టు

అంతర్ జిల్లా దొంగ అరెస్టు

Intercept district detain arrested

మన తెలంగాణ/నిర్మల్‌టౌన్ : వివిధ జిల్లల్లో దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకొని తిరుగుతున్న అంతర్ జిల్లాల దొంగను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితున్ని వివరాలను వెల్లడించారు. పట్టణంలోని రాంనగర్ కాలనీకి చెందిన ఎస్‌కె యామిన్ అలియాస్ సిహెచ్,గోపి దొంగతనాలను వృత్తిగా మలుచుకొని నిర్మల్ జిల్లాతో పాటు నిజామాబాద్,జగిత్యాల,హైదరాబాద్‌లో పలు దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకుంటూ తిరుగుతున్నారని జిల్లాకేంద్రంలో ఇటీవల చేపట్టిన వాహన తనిఖీల్లో పట్టుబడడంతో విచారించగా తాను చేసిన దొంగతనాలను వివరించాడు, మార్చి నెలలో ఓ మైనార్ బాలికను ద్విచక్ర వాహనం పై ఎత్తుకెళ్లి హత్యచారం చేయడంతో పాటు 2013 సంవత్సరంలో నిర్మల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు కేసుల్లో నిందితునిగా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయిందని తెలిపారు. అలాగే హైదరాబాద్  వియాపూర్‌లోని సైబరాబాద్ పోలీస్ స్టేషన్‌లో మూడు చోరి కేసుల్లో ఇతని పై కేసు నమోదు కాగా ఆదిలాబాద్ పట్టణంలో ఓ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇతను హైదరాబాద్‌లోని చంచల్‌గూడ  జైలులో శిక్షను అనుభవించినప్పటికీ ఇతడి ప్రవర్తన మారకపోవడంతో ఇతన్ని నిజామాబాద్,జగిత్యాల,మెట్‌పెల్లి జిల్లాలలో దొంగతనాలను చేస్తున్నాడని దొంగలించిన సొత్తును మహారాష్ట్రలోని కిన్వాట్ పట్టణంలో ని ముత్తూర్ ఫైనాల్స్‌లో 35 తులాల బంగారం,67 తులాల వెండిని దాదాపు 11లక్షల 58వేల సొత్తును కుదువ బెట్టాడని తెలిపారు. ఇతని వద్ద నుంచి ఒక టీఎస్ 04ఇఇ0401 నంబర్ గల ద్విచక్ర వాహనాన్ని 3.7 తులాల బంగారాన్ని 12 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు. పలు కేసుల్లో నిందితునిగా ఇతని పై పిడియాక్ట్ కేసును నమోదు చేశామని తెలిపారు.  వివిధ జిల్లాలొ నేరాలకు పాల్పడుతున్న నిందితున్ని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన నిర్మల్ డిఎస్పీ మనోహర్‌రెడ్డి,పట్టణ సీఐ జాన్‌దివాకర్,ఖానాపూర్ సీఐ అశోక్,నిర్మల్ పట్టణ ఎస్సై నర్సారెడ్డి,కానిస్టేబుల్ కె.సందీప్,సిహెచ్ రమేష్,ఉషన్న,రాజశేఖర్, సుదర్శన్‌లను అభినందించి వీరికి రివార్డును అందిస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఎస్పీ దక్షిణమూర్తి,డిఎస్పీ మనోహర్‌రెడ్డి,సీఐ జాన్‌దివాకర్,అశోక్ పాల్గొన్నారు.