Home తాజా వార్తలు హైదరాబాద్‌లో రైళ్లు ఢీ

హైదరాబాద్‌లో రైళ్లు ఢీ

MMTS Trains

 

35 మందికి గాయాలు
నుజ్జు నుజ్జయిన క్యాబిన్‌లో చిక్కుకున్న లోకో పైలట్, 9గం.పాటు శ్రమించి బయటకు తెచ్చిన ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు, తీవ్ర గాయాలతో కేర్ ఆసుపత్రికి
కాచిగూడ స్టేషన్ సమీపంలో హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న ఎంఎంటిఎస్ రైలు
హైదరాబాద్ కాచిగూడలో ఘటన, 35 మంది ప్రయాణీకులకు గాయాలు, సాంకేతిక లోపం వల్లే రైలు ప్రమాదం, ప్రమాదంపై విచారణకు అదేశం : ఎజిఎం బిబిపాటిల్, ప్రమాదంలో ఐదు భోగీలు ధ్వంసం, తక్కువ వేగం వల్ల తప్పిన పెను ప్రమాదం, ప్రమాద స్థలిని పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని

హైదరాబాద్‌ః నగరంలోని కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలోని నింబోలిఅడ్డ వద్ద సోమవారం ఉదయం ఆగివున్న కర్నూలు హంద్రీ ఎక్స్‌ప్రెక్స్ రైలును ఎంఎంటిఎస్ రైలు వెనుక నుంచి ఢీకొట్టిన ప్రమాద ఘటనలో 35 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 13 మంది ఉస్మానియా ఆస్పత్రికి, మిగతావారిని ఇతర ఆస్పత్రులకు తరలించి వైద్య సేవలందిస్తున్నారు. ఎంఎంటిఎస్ రైలు క్యాబిన్ లోకో పైలెట్ శేఖర్ దాదాపు 9 గంటల పాటు చిక్కుకున్నాడు. ప్రమాదంలో చిక్కుకున్న లోకో పైలట్ చంద్రశేఖర్‌ను ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది బయటకు తీశారు.

కేబిన్ నుజ్జునుజ్జు కావడంతో అందులో ఉన్న లోకో పైలట్ తీవ్రంగా గాయపడ్డారు. సుమారు 9 గంటలపాటు నరకయాతన అనుభవించిన లోలోఫైలట్ ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది రక్షించారు. గ్యాస్ కట్టర్‌సాయంతో కేబిన్ ను కత్తిరించి చంద్రశేఖర్ ను బయటకు తీశారు. వెంటనే అతడిని నాంపల్లిలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. లోకోపైలట్ చంద్ర శేఖర్ చికిత్సకు స్పందిస్తున్నారని కేర్ ఆసుప్రతి వైద్యులు తెలిపారు. ఇదిలావుండగా సిగ్నలింగ్ లోపమే ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే జిహెచ్‌ఎంసికి చెందిన డిఆర్‌ఎఫ్ బృందాల సంఘటనా ప్రదేశానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టాయి.

ప్రమాదం జరిగిందిలా : కాచిగూడ రైల్వే స్టేషన్ నింబోలి అడ్డ వద్ద ఆగి ఉన్న ప్యాసింజర్ రైలును ఎంఎంటిఎస్ రైలు ఢీకొంది. కర్నూలు సిటీ నుంచి సికింద్రాబాద్ వస్తున్న హంద్రీ ఎక్స్‌ప్రెక్స్ రైలు కాచిగూడ స్టేషన్ వద్ద సిగ్నల్ కోసం ఆగి ఉంది. అయితే సిగ్నల్ లోపం వల్ల అదే ట్రాక్‌పై ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న ఎంఎంటిఎస్ రైలు వచ్చింది. హంద్రీ ఎక్స్‌ప్రెక్స్ రైలును వెనుక నుంచి ఢీకొంది. దీంతో ఎంఎంటి ఎస్ రైలు మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 35 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఎంఎంటిఎస్ రైలు వేగం తక్కువ ఉండడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను రైల్వే పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాచిగూడ స్టేషన్లో జరిగిన రైలు ప్రమాదంలో ఎంఎంటిఎస్ లోకో పైలెట్ క్యాబిన్లోనే ఇరుక్కుపోయాడు.

ముందు భాగం నుజ్జునుజ్జు అవడంతో లోకో పైలెట్‌ను బయటకు తీసేందుకు గ్యాస్ కట్టర్లను ఉపయోగించారు. ఈ నేపథ్యంలో వైద్యులు ఘటనాస్థలికే వెళ్లి లోకో పైలెట్కు స్లైన్లు ఎక్కించారు. ఈక్రమంలో జిహెచ్‌ఎంసికి చెందిన ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు కూడా సహాయ చర్యల కోసం కాచిగూడకు చేరుకుని అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించారు. ప్రమాదధాటికి ఎంఎంటీఎస్ రైలులో ఉన్న పలువురు ప్రయాణికులు ముళ్ల పొదల్లోకి ఎగిరిపడ్డట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను రైల్వే అధికారులు నిలిపివేశారు.

ఉస్మానియా సూపరింటెండెంట్‌కు గవర్నర్ ఫోన్ ః కాచిగూడ రైల్వే స్టేషన్ లో రైలు ప్రమాద ఘటన సమాచారం అందుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్‌కు ఫోన్ చేశారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారి పరిస్థితి గురించిన గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అడ్మిట్ అయిన అందరికి తక్షణ చికిత్స అందించి ఆదుకోవాలని గవర్నర్ ఆదేశించారు. ఈ సందర్బంగా ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ మీడియాతో మాట్లాడుతూ ట్రైన్ యాక్సిడెంట్ లో గాయపడిన క్షతగాత్రులందికి తక్షణ వైద్యం అందించి వివిధ విభాగాల్లో అడ్మిట్ చేసి చికిత్స చేస్తున్నామని తెలిపారు .

అన్ని విభాగాల వారు అప్రమత్తం చేశామని, క్షతగాత్రులను ఆర్‌ఎంఒ లు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన 14 మందిని ఉస్మానియా ఆసుపత్రి కి తరలించారని, వారిలో. ఆర్థోపెడిక్ విభాగం లో నలుగురు , జనరల్ సర్జరీ విభాగం లో ఇద్దరిని అడ్మిట్ చేశామన్నారు . ఇదిలావుండగా అడ్మిట్ అయిన వారిలో ఒకరి విషమంగా విషమంగా ఉందని వైద్యవర్గాలు తెలిపాయి. మరికొంత మంది క్షతగాత్రులను వైద్య సేవల నిమిత్తం రైల్వే పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఘటనాస్థలాన్ని పరిశీలించిన కిషన్ రెడ్డి ః
కాచిగూడ వద్ద ఘటన జరిగిన ప్రదేశాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంఎల్‌సి రామచంద్రరావు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రమాదం దురదృష్టకరమని..మానవ తప్పిదం వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోందన్నారు. ఎన్‌డిఆర్‌ఎఫ్, ఆర్‌పిఎఫ్ స్థానిక పోలీసుల సహకారంతో సహాయ చర్యలను వేగవంతం చేసినట్లు ఆయన చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా రైల్వే అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు.

9 గంటల పాటు క్యాబిన్ లో చిక్కుకున్న డ్రైవర్
ఈ ప్రమాదంలో ఎంఎంటిఎస్ రైలు డ్రైవర్ చంద్రశేఖర్ క్యాబిన్ లో 9 గంటల పాటు చిక్కుకున్నాడు. సంఘటన స్థలికి చేరుకున్న ఎన్‌డిఆర్‌ఎఫ్ రైల్వే సిబ్బంది అతడిని బయటకి తీసేందుకు గ్యాస్‌కట్టర్లను ఉపయోగించారు. ఈక్రమంలో అపస్మారక స్థితిలో ఉన్న డ్రైవర్ చంద్రశేఖర్‌కు ప్రత్యేక పద్ధతుల ద్వారా ఆక్సిజన్ అందించారు. గ్యాస్ కట్టర్‌సాయంతో కేబిన్ ను కత్తిరించి చంద్రశేఖర్ ను బయటకు తీశారు. వెంటనే అతడిని నాంపల్లిలోని కేర్ ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదంపై విచారణకు అదేశం ః ఎజిఎం బిబిపాటిల్
ఎంఎంటిఎస్ డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని దక్షిణ మధ్య రైల్వే జోన్ అదనపు జనరల్ మేనేజర్ బిబి.సింగ్ వెల్లడించారు. సోమవారం సమాచారం అందుకున్న అనంతరం కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ లింగంపల్లి- నుంచి ఫలక్‌నూమాల మధ్య రైల రాకపొకలను నిలిపివేశామని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎంఎంటిఎస్ రైలుకు చేందినఆరు బోగీలు , ఎక్స్‌ప్రెస్ రైలుకు చేందిన మూడు భోగిలు దెబ్బతిన్నాయి.

మంత్రి తలసాని సందర్శన:
రైలు ప్రమాద సమాచారం అందుకున్న రాష్ట్ర పాడి పరిశ్రమ, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంటనే ప్రమాద స్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రైల్వే అధికారులతో మాట్లాడి, గాయపడిన వారికి మేరుగైన వైద్యసేవలను అందించాలని అదేశించారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రైల్వే అధికారులను సూచించారు. మంత్రి తలసాని వెంట అంబర్ పేట శాసన సభ్యులు కాలేరు వెంకటేశ్ తదితరులు ఉన్నారు.

రైల్వే అధికారుల నిర్లక్షమే:
కాచిగూడ రైల్వే స్టేషన్ కూత వేటు దూరంలో జరిగిన రైలు ప్రమాదానికి రైల్వే అధికారుల నిర్లలక్షంగా కనిపిస్తుందని ప్రయాణికులు ఆరోపించారు. ఒకే ట్రాక్ పై ఎక్స్‌ప్రెస్ రైలు, ఎంఎంటిఎస్ రైళ్లకు ఏలా..? సిగ్నల్ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. సోమవారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ప్లాట్ ఫారం పైకి రావాల్సిన కర్నూల్ ఇంటర్ సిటి ఎక్స్‌ప్రెస్ రైలు సాంతికే లోపంగా మూలంగా నిల్చిపోవడంతో కాచిగూడ నుంచి ఫలక్‌నూమా వెళ్లే ఎంఎంటిఎస్ రైలు రెండో ప్లాట్ ఫారం పై నుంచి బయలుదేరి ఆగిన రైలును ఢికొంది. ఎంఎంటిఎస్ రైలు పైలట్ తప్పిదమా..? సిగ్నల్ ఇవ్వడమా ..? అనేది విచారణలో తేలుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

Intercity and MMTS Trains collided