Thursday, April 18, 2024

నేటి సాయంత్రం 3గంటలకు ఇంటర్ ఫలితాలు

- Advertisement -
- Advertisement -

Intermediate results today release

 

మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు
విడుదల చేయనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : ఇంటర్మీడియట్ ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ప్రథమ,ద్వితీయ సంవత్సరాల ఫలితాలను విడుదల చేయనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ సారి తొలిసారిగా మీడియా సమావేశం లేకుండా క్లౌడ్ ద్వారా ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఇంటర్ పరీక్ష ఫలితాల ప్రక్రియను పూర్తి చేసిన ఇంటర్ బోర్డు బుధవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మార్చిలో జరిగిన పరీక్షలకు 9.65 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడిన ఇంటర్ జాగ్రఫీ, మోడ్రన్ లాంగ్వేజెస్ పరీక్షలు ఈ నెల 3వ తేదీన నిర్వహించారు. లాక్‌డౌన్ అమల్లోకి రావడం వల్ల మార్చి 23న జరగాల్సిన ఇంటర్ జాగ్రఫీ, మోడ్రన్ లాంగ్వేజ్ పరీక్షలు వాయిదాపడ్డాయి. ఈ నెల 3వ తేదీన మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ పరీక్షకు కరోనా పరిస్థితుల వల్ల రవాణా సదుపాయం లేక, ఇతర కారణాలతో హాజరు కాలేని విద్యార్థులు జూలై మూడవ వారంలో జరిగే సప్లిమెంటరీ పరీక్ష రాయవచ్చని ఇంటర్ బోర్డు ప్రకటించింది. సప్లిమెంటరీ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులను కూడా రెగ్యూలర్ విద్యార్థులు గానే పరిగణిస్తామని బోర్డు స్పష్టం చేసింది.
ఇంటర్ ఫలితాల కోసం విద్యార్థులు www.tsbie.cgg.gov.in వెబ్‌సైట్ చూడవచ్చు. ఇంటర్ ఫలితాలు వెలువడిన నెల రోజుల్లో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. వార్షిక పరీక్షలకు హాజరైన వారిలో 30 శాతం మంది వీటికి హాజరు కానున్నారు.

అందుబాటులో ఆన్‌లైన్ ఫిర్యాదుల విధానం

ఇంటర్ ఫలితాలలో ఏమైనా తప్పులు దొర్లినట్లు విద్యార్థులు గుర్తిస్తే తమ సమస్యల పరిష్కారం కోసం ఇంటర్ ఆన్‌లైన్ ఫిర్యాదుల విధానం (బోర్డు ఆఫ్ ఇంటర్మీడియేట్ గ్రివియెన్స్ రిడ్రెసల్ సిస్టమ్- బిఐజిఆర్‌ఎస్)లో ఫిర్యాదు చేసుకోవాలి. ఈ మేరకు ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో ప్రత్యేక విండోను పొందుపరించారు. ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా www.bigrs.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేయడానికి విద్యార్థికి లేదా తల్లిదండ్రులకు ఫోన్ నెంబర్ ఉంటే సరిపోతుంది. విద్యార్థులు ఫిర్యాదు చేసిన వెంటనే వారి ఫోన్ నెంబర్‌కు టోకన్ నెంబర్‌తో ఎస్‌ఎంఎస్ వస్తుంది. విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసిన వెంటనే సంబంధిత అధికారికి, ఉన్నతాధికారులకు సమాచారం వెళుతుంది. విద్యార్థుల ఫిర్యాదు ఏ దశలో ఉందో కూడా తెలుసుకోవచ్చు. విద్యార్థుల ఫిర్యాదులను నిర్ధిష్ట కాలపరిమితితో రెండు మూడు రోజుల్లో పరిష్కారించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఒత్తిడి నివారణకు సైకాలజిస్టుల సేవలు

ఇంటర్ విద్యార్థుల మానసిక ఒత్తిడి నివారణకు ఇంటర్ బోర్డు ఏడుగురు క్లినికల్ సైకాలజిస్టులను నియమించింది. మానసిక ఒత్తిడికి లోనయ్యే విద్యార్థులు ఫోన్‌లో సైకాలజిస్టులను సంప్రదించి తగిన సలహాలు, సూచనలు పొందవచ్చు.

సైకాలజిస్టు పేరు ఫోన్ నెంబర్

1.డాక్టర్ అనిత 7337225803
2.డాక్టర్ మజల్ అలీ 7337225425
3. డాక్టర్ రజిని 7337225364
4.పి. జవహార్‌లాల్ నెహ్రూ 7337225360
5.ఎస్.శ్రీలత 7337225083
6.శైలజ పిసపాటి 7337225098
7.అనుపమ గుట్టిమ్‌దేవి 7337225763

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News