Home తాజా వార్తలు హర్యానా దొంగల ముఠా అరెస్ట్…

హర్యానా దొంగల ముఠా అరెస్ట్…

internal-thives-arrest-by-r

హైదరాబాద్: రైల్వేస్టేషన్లలో చోరీలకు పాల్పడుతున్న హర్యానా దొంగల ముఠాను మంగళవారం రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను ఎస్పి జి. అశోక్ మీడియాకు ముందు ప్రవేశపెట్టారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, బెంగళూరు రైల్వే స్టేషన్లలో వరస చోరీలు చేసినట్టు అశోక్ తెలిపారు. నిందితుల నుంచి 3 కెజిల బంగారం, 280 గ్రాముల వెండి, రూ. 2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. రైల్వేస్టేషన్లలో ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని ప్రయాణికులకు రైల్వే ఎస్పి సూచించారు.